E-Paper
Advertisement

Japan Empty Houses: జపాన్‌లో ఇళ్లన్నీ ఖాళీ.. ఫ్రీగా ఇచ్చేయడానికి సిద్ధమవుతోన్న ప్రభుత్వం, మీకు కావాలా?

Japan Empty Houses: జపాన్‌లో ఇళ్లన్నీ ఖాళీ.. ఫ్రీగా ఇచ్చేయడానికి సిద్ధమవుతోన్న ప్రభుత్వం, మీకు కావాలా?
Advertisement

జపాన్.. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. పంటలు పండించే విధానం నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు చాలా అడ్వాన్స్ డ్ గా ఉన్నారు. కానీ, ఆ దేశం ఓ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. చాలా గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. రోజు రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ అవుతున్న ఇళ్ల సంఖ్య పెరిగిపోతోంది. జపనీస్ గ్రామాల మీదుగా ప్రయాణాలు కొనసాగిస్తున్న సమయంలో చాలా చోట్ల పడావుపడ్డ ఇళ్లు, దుమ్ముకొట్టుకుపోయిన కిటికీలు, పిచ్చి మొక్కలతో నిండిన భవనాలు దర్శనం ఇస్తున్నాయి. చాలా చోట్ల ఎవరూ నివసించని ఇళ్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఎందుకు ఇళ్లు ఖాళీ అవుతున్నాయంటే..

జపాన్ లో 10 మిలియన్ల ఖాళీ ఇళ్లు

ప్రస్తుతం జపాన్‌లో దాదాపు 10 మిలియన్ల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. కొన్ని దేశాల జనాభాతో పోల్చిలే ఈ సంఖ్య ఎక్కువ కావడం విశేషం. ఈ సంఖ్య త్వరలో 11 మిలియన్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే.. ప్రస్తుతం జపాన్ లో ఉన్న అన్ని ఇళ్లలో ఖాళీ ఇళ్లు ఏకంగా 14 శాతం ఉన్నాయి. ఇంతకీ జపాన్ లో పలు గ్రామాలు, పట్టణాలు ఎందుకు ఖాళీ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

డబ్బు సమస్యలు కాదు, ప్రజల సమస్యలు

Advertisement

1990 నాటి ఆర్థిక మాద్యం కారణంగా జపాన్ లో ఇలాంటి పరిస్థితి రావచ్చని చాలా మంది భావిస్తారు. కానీ, అందులో నిజం లేదు. జపాన్ లో జనభా తగ్గిపోవడమే అసలు కారణం. జపాన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యల్ప జనన రేటు కలిగిన దేశాలలో ఒకటిగా కొనసాగుతోంది. యువ జంటలు తక్కువ పిల్లలను కలిగి ఉంటున్నారు. చాలా వరకు ఒక్కరిని మాత్రమే కంటుండగా, మరికొంత మంది అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు. అదే సమయంలో, మంచి ఆరోగ్య పద్దతుల కారణంగా  ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆ దేశంలో వృద్ధుల సంఖ్య ఎక్కువ యువత సంఖ్య తక్కువగా ఉంది.

నగరాలకు పెరుగుతున్న వలసలు

జపాన్ యువత కూడా నగరాల్లోనే జీవించాలని కోరుకుంటుంది. టోక్యో, ఒసాకా, నగోయా లాంటి పెద్ద నగరాలకు ఎక్కువగా వలసపోతోంది. అక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నారు చాలా మంది యువతీ,యువకులు. చాలా గ్రామాల నుంచి వలస వెళ్తున్న వారితో ఈ నగరాలు రోజు రోజుకు మరింత విస్తరిస్తున్నాయి.  చిన్న పట్టణాలు, పొలాలలో పనులు  దొరకడం కష్టం అవుతోంది. యంత్రాలు ఎక్కువ కావడంతో కార్మికుల అవసరం తగ్గిపోతుంది. ఈ కారణంగా చాలా మంది నగరాలకు పనుల కోసం వెళ్లిపోతున్నారు. వ్యవసాయం, మత్స్యరంగం కుదేలు అయ్యింది. ఫలితంగా,  పలు గ్రామాలు, పట్టణాలు ఖాళీ అవుతున్నాయి.

రోజు రోజుకు తగ్గిపోతున్న జనాభా

Advertisement

అటు జపాన్ లో జనాభా రోజు రోజుకు తగ్గిపోతోంది. 2008లో 128 మిలియన్లు ఉండగా, ఇప్పుడు 125 మిలియన్లకు తగ్గింది. 2070 నాటికి, ఈ సంఖ్య 30% కంటే తక్కువ కానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరిన్ని ఇళ్లు ఖాళీ అయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, జపాన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లను మరమ్మతులు చేసుకోవడానికి  ఆర్థికసాయం చేస్తోంది. మరికొన్ని పట్టణాల్లోని ఖాళీ ఇళ్లను హోటళ్ళు,  పర్యాటకుల కోసం పొలాలుగా మారుస్తోంది. విదేశీయులు వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి పిక్ నిక్ స్పాట్లుగా తీర్చిదిద్దుతున్నారు. మరికొన్ని చోట్ల డెవలప్ చేస్తామని చెప్పే వారికి జపాన్ ప్రభుత్వం ఉచితంగానే ఇళ్లు, స్థలాలను కేటాయిస్తోంది.

Read Also: కాలి నొప్పి అని లీవ్ పెట్టి పరిగెత్తుతావా? ఉద్యోగం నుంచి పీకేసిన కంపెనీ, కోర్టు సంచలన తీర్పు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×