E-Paper
Advertisement

Modern Love Story: భార్య కోసం తాజ్ మహల్ కట్టేసిన భర్త, నిజంగా నువ్ గ్రేట్ భయ్యా!

Modern Love Story: భార్య కోసం తాజ్ మహల్ కట్టేసిన భర్త, నిజంగా నువ్ గ్రేట్ భయ్యా!
Advertisement

Love Like Shah Jahan: తాజ్ మహల్. పెద్దగా పరిచయం అవసరం లేని ప్రసిద్ధ పర్యాటక కట్టడం. తన భార్య ముంతాజ్ మహల్ మరణం అనంతరం ఆమె మీద ప్రేమకు ప్రతిరూపంగా, ఆమె జ్ఞాపకార్థం ఆగ్రాలో తాజ్ మహల్ ను నిర్మించారు. ఆమె సమాధిగా భావించే ఈ అద్భుత నిర్మాణం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచింది. తాజ్ మహల్ ను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అయితే, మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి కూడా తన భార్య కోసం ఏకంగా తాజ్ మహల్ కట్టించాడు. షాజహాన్ తన భార్య చనిపోయిన తర్వాత తాజ్ మహల్ ను నిర్మిస్తే, ఈ అభినవ షాజహాన్ భార్యకు తాజ్ మహల్ లాంటి ఇల్లును కట్టించాడు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.?

మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ కు చెందిన ఆనంద్ ప్రకాష్ చౌక్సే కొద్ది సంవత్సరాల క్రితం తన భార్యతో కలిసి తాజ్ మహల్ కు వెళ్లాడు. అక్కడ తన భార్య తాజ్ మహల్ ను చూసి ఫిదా అయ్యింది. ఎలాగైనా తనకు ఇలాంటి కట్టడాన్ని కట్టించాలని భర్తను కోరింది. అయితే, తాను చనిపోయిన తర్వాత సమాధి రూపంలో కాదని, ఉండేందుకు ఇల్లు మాదిరిగా నిర్మించాలన్నది. భార్య కోరికకు ముచ్చటపడి.. 2021లో బుర్హాన్‌పూర్‌ లో అచ్చం తాజ్ మహల్ లాంటి అద్భుతమైన పాలరాయి ప్రతిరూపాన్ని నిర్మించాడు. నాలుగు సంవత్సరాల తరువాత ఈ నిర్మాణం పూర్తయ్యింది.

తాజ్ మహల్ రూపంలో 4BHK ఇల్లు నిర్మాణం

Advertisement

ఈ తాజ్ మహల్  4BHK ఇల్లుగా నిర్మించారు. ఈ ఇల్లు పూర్తిగా మక్రానా పాలరాయితో రూపొందించబడిందని యజమాని ఆనంద్ ప్రకాష్ చౌక్సే తెలిపారు. తాజ్ మహల్ ను ఇంటి అవసరాలకు అనుగుణంగా నిర్మించేందుకు, డిజైన మాత్రమే అలా ఉండేలా చూశామన్నారు. అసలు కొలతల్లో చాలా తేడా ఉంటుందన్నారు. ఒరిజినల్ తాజ్ మహల్ తో పోల్చితే చిన్న పరిమాణంలో ఉంటుందన్నారు. ఇంకా చెప్పాలంటే మూడింట ఒకవంతు ఉంటుందని చెప్పారు. ఈ అద్భుత నిర్మాణాన్ని తన భార్య, ప్రేమికురాలు అయిన డాక్టర్ మంజూషాకు అంకితం ఇచ్చినట్లు చెప్పారు.

అచ్చం తాజ్ మహల్ మాదిరిగానే.. 

చౌక్సీ ఇల్లు అసలు తాజ్ మహల్ లాగా అనిపిస్తుందని ట్రావెల్ క్రియేటర్ ప్రియమ్ సరస్వత్. తాజాగా ఆయన ఈ తాజ్ మహల్ హోమ్ టూర్ చేశారు.  అద్భుతమైన ఈ ఇంటిన నిర్మాణాన్ని చూసి ఆయన ఫిదా అయ్యారు. చక్కటి ఎంట్రెన్స్, అద్భుతమైన ఫర్నీచర్, ఇంటిరియర్స్, డోమ్ ఆకట్టుకుంటున్నాయి. చౌక్సీ దంపతులు నడిపించే రెసిడెన్షియల్ పాఠశాల క్యాంపస్‌ కు ఎదురుగా ఈ ఇల్లు అద్భుతంగా కనిపిస్తుంది. చౌక్సీ విద్యాసంస్థ దేశంలోని అత్యంత హైటెక్ ఆధునిక గురుకుల్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో దాదాపు 2,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Read Also: బాబోయ్.. పసి బిడ్డను స్కూటర్ డిక్కీలో పెట్టుకుని.. తల్లి షికారు, వీడియో వైరల్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×