E-Paper
Advertisement

OTT Movies: ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కొత్త సినిమాల స్ట్రీమింగ్ పై కఠిన నిబంధనలు..!

OTT Movies: ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కొత్త సినిమాల స్ట్రీమింగ్ పై కఠిన నిబంధనలు..!
Advertisement

OTT Movies: సౌత్ ఇండియన్ సినిమా రంగంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో సినిమాల ఆదాయాన్ని పెంచేందుకు ఎగ్జిబిటర్లు కొత్త నిబంధనను అమలు చేయాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రకారం ఇకపై సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 8 వారాల గ్యాప్ తర్వాతే OTT ప్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్‌కు రావాలి.

ప్రస్తుతం చాలా సినిమాలు థియేటర్లలో విడుదలైన 4 వారాలకే OTTలో అందుబాటులోకి వస్తున్నాయి. పెద్ద సినిమాలే కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అయితే ఈ తక్కువ గ్యాప్ కారణంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందని ఎగ్జిబిటర్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

ప్రేక్షకులు చాలాసార్లు సినిమా చూడడానికి థియేటర్‌కు వెళ్లకుండా, కొద్దిరోజులు ఆగి OTTలో చూసేద్దామని భావిస్తున్నారు. దీనివల్ల సినిమాలు థియేటర్లలో ఎక్కువ రోజులు నడవడం లేదు. ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అప్పటివరకు నో స్ట్రీమింగ్..!

అంతేకాదు, హిట్ సినిమాలు కూడా రెండో వారానికే కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. ప్రేక్షకులు మళ్లీ థియేటర్‌కు వెళ్లి అదే సినిమాను చూడడం కూడా తగ్గిపోయింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 8 వారాల OTT విండో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Advertisement

అయితే ఈ నిర్ణయంపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం చాలా సినిమాలకు OTT డీల్స్ ముఖ్యమైన ఆదాయ వనరుగా మారాయి. 8 వారాల గ్యాప్ పెరిగితే OTT కంపెనీలు ఇచ్చే డీల్స్ కొంత తగ్గే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

అయినా కూడా చాలా మంది సినీ అభిమానులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. పెద్ద స్క్రీన్ అనుభూతిని ఆస్వాదించడానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడం అవసరమని వారు భావిస్తున్నారు. టికెట్ ధరలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల సినిమాలు ఎక్కువ కాలం థియేటర్లలో ఉండటం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పైన చూస్తే ఈ 8 వారాల OTT విండో నిర్ణయం అమల్లోకి వస్తే థియేటర్లకు మళ్లీ ప్రేక్షకులు పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపై కూడా ఇది మంచి ప్రభావం చూపే అవకాశముంది.

ALSO READ: Harish shankar: ఆ హీరోని ఏమైనా అంటే కళ్ళు పోతాయి.. వివరణ ఇచ్చిన హరీష్ శంకర్!

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×