E-Paper
Advertisement

Telangana BJP: మూసీ ప్రక్షాళన కావాల్సిందే.. కాకపోతే ఆ విధంగా, తెలంగాణ బీజేపీ చీఫ్ మాట

Telangana BJP: మూసీ ప్రక్షాళన కావాల్సిందే.. కాకపోతే ఆ విధంగా, తెలంగాణ బీజేపీ చీఫ్ మాట
Advertisement

Telangana BJP: తెలంగాణలో రాజకీయాలు మూసీ ప్రక్షాళన చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ నోరు విప్పింది. మూసీ ప్రక్షాళనకు తాము కోరుకుంటున్నామని మనసులోని మాట బయటపెట్టారు ఆ పార్టీ చీఫ్ రాంచందర్ రావు.

మూసీ ప్రక్షాళన కావాల్సిందే-తెలంగాణ బీజేపీ చీఫ్

Advertisement

ఈ వ్యవహారంపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన కావాలనే కోరుకుంటున్నామని, గాంధీ సరోవర్ పేరుతో ఆయా ప్రాంతాల్లో ఉండే పేద-మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చడం కరెక్ట్ కాదన్నారు. అక్కడ అంతా ఇళ్లు కట్టుకుని ఉన్నారన్నారు. ఫ్లాట్స్, పార్కులు, వినాయక కాలనీలు ఉన్నాయని గుర్తు చేశారు.

లీగల్‌‌గా ఉన్న ఏ ఇళ్లు కూడా కూలగొట్టకుండా ప్రక్షాళన చేయవచ్చన్నారు. రెండోది సబర్మతి ప్రాజెక్టు కోసం అక్కడున్న నిర్వాసితులను వసతి కల్పించిన తర్వాత ఆ ప్రాజెక్టు అక్కడి ప్రభుత్వం చేపట్టిందన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 400 లేదా 500 ఎకరాలు ఎందుకని అదే సమయంలో ప్రశ్నించారు. ఒక్క ఇళ్లు డ్యామేజ్ కాకుండా గాంధీ విగ్రహం పెడితే అందరూ సంతోషిస్తామన్నారు.

Advertisement

సబర్మతి ప్రాజెక్టు కోసం ఆ విధంగా చేశాం

శుక్రవారం మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై కార్పొరేషన్ ఎండీ నర్సింహారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ నోరు విప్పారు. మూసీ నదిని మార్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించింది.

మొత్తం 55 కిలోమీటర్లు మేరా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో తొలి దశలో 21 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి చేయనుంది. ముఖ్యంగా వరద ముప్పు నివారించడం ఒకటి. మురుగు నీరు నదిలో కలవకుండా చూడటం రెండోది. గోదావరి జలాలతో మూసీని నింపడం మూడోది. బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది.

ALSO READ: జోరుగా అక్రమ రేషన్ దందా? పేదల బియ్యం కర్ణాటకకు.. అధికారుల నిఘా ఎక్కడ?

నీరు, పర్యావరణం, ల్యాండ్ యూజ్, మౌలిక సదుపాయాలు వంటిని ఆర్థిక ప్రణాళికలో ఉన్నాయి. తొలిదశలో గండిపేట మీదుగా రాజేంద్రనగర్ నుంచి బాపు ఘాట్ వరకు 21 కిలోమీటర్ల మేరా పనులు చేపట్టనుంది. అందుకోసం రూ.6 వేల నుంచి రూ.7 వేల కోట్లు ఖర్చవుతుందని ఓ అంచనా. నదిలో పూడికతీత, నది గర్భం ప్రొఫైలింగ్‌తోపాటు వరద నివారణ గోడలు, మురుగు కాలువల నిర్మాణం వంటి పనులు ఉండనున్నాయి.

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×