E-Paper
Advertisement

Drainage Gas: ప్రధాని చెప్పినట్లు.. డ్రైనేజీ నుంచి గ్యాస్ తీయొచ్చా? ఇదిగో వీళ్లు ట్రై చేస్తే ఏమైందో చూడండి!

Drainage Gas: ప్రధాని చెప్పినట్లు.. డ్రైనేజీ నుంచి గ్యాస్ తీయొచ్చా? ఇదిగో వీళ్లు ట్రై చేస్తే ఏమైందో చూడండి!
Advertisement

Drainage Gas: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత్ లో గ్యాస్ కొరత తలెత్తింది. బుక్ చేసిన వెంటనే సిలిండర్లు రాకపోతుండటంతో.. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్లను కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. డ్రైనేజీ నుంచి వంట గ్యాస్ వెలికి తీశానని మోదీ (PM Modi) చెప్పడంపై సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు దర్శనమిస్తున్నాయి.

అసలు మోదీ ఏం చెప్పారు?

2018లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రైనేజీ పైపులో నుంచి వచ్చే గ్యాస్ ను ఉపయోగించుకొని.. తాను టీ చేసుకున్నానని, ఇంటి అవసరాలు తీర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. తాజాగా ఎల్‌పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో మారోమారు మోదీ వ్యాఖ్యలను.. ఆయన ప్రత్యర్థి పార్టీ శ్రేణులు తెరపైకి తీసుకొస్తున్నారు. దేశంలోని గ్యాస్ కొరతకు ప్రధాని మోదీ పరిష్కారం చూపించారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Advertisement

వీడియోలతో ట్రోల్స్..!

ప్రధాని మోదీ చెప్పినట్లుగానే కొందరు స్టవ్ కు గ్యాస్ సరఫరాను చేసే పైపును డ్రైనేజీలో పెట్టి.. పొయ్యి వెలిగించడానికి ట్రై చేస్తున్నారు. అయితే అది పనిచేయకపోవడంతో ప్రధానిని పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంకాస్త వ్యంగ్యంగా.. డ్రైనేజీ నుంచి వచ్చే గ్యాస్ ను ఉపయోగించుకొని టీ పెట్టుకున్నట్లు సెటైరికల్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. మోదీ ఇచ్చిన ఐడియాతో తాము ఈ గ్యాస్ కొరత సమయంలోనూ హ్యాపీగా ఉంటున్నామని చమత్కారంగా క్యాప్షన్స్ పెడుతున్నారు. మెుత్తంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు.. నెట్టింట పెద్ద బజ్ నే క్రియేట్ చేశాయని చెప్పవచ్చు.

Advertisement

Also Read: Dishwasher Uninstall: డిష్ వాషర్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలా? ఈ స్టెప్స్ పాటిస్తే సరి.. ఈజీగా పని అయిపోద్ది!

మోదీ వ్యాఖ్యల్లో నిజమెంత?

అయితే ప్రధాని మోదీ చెప్పినట్లుగా డ్రైనేజీ నుంచి వంట గ్యాస్ ను వెలికితీయడం సాంకేతికంగా సాధ్యమేనని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. ఈ ప్రక్రియను బయోగ్యాస్ లేదా బయో సీఎన్జీ అని కూడా అంటారు. సాధారణంగా డ్రైనేజీ నీటిలో ఉండే వ్యర్థ పదార్థాల నుండి మిథేన్ వాయువు విడుదల అవుతుంది. దానికి ఇంధనంలా మండే గుణం ఉంటుంది. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కు చెందిన శ్యాంరావు షిర్కే అనే వ్యక్తి.. మురుగు నీటి నుంచి బయో సీఎన్జీ గ్యాస్ ను తయారు చేసి.. మోదీ మాటల్లో వాస్తవం ఉందని నిరూపించారు.

Also Read: Recharge Plans: మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్.. 28 రోజులే ఎందుకు? దీని వెనకున్న వ్యూహం ఏంటి?

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×