E-Paper
Advertisement

Viral News : పెళ్లి పేరుతో యువకుడికి వల.. నగదు,బంగారంతో యువతి జంప్.

Viral News : పెళ్లి పేరుతో యువకుడికి వల.. నగదు,బంగారంతో యువతి జంప్.
Advertisement
Viral News

Viral News : ఇదే మొదటి పెళ్లి అంటూ రేవంత్ అనే యువకుడిని మోసం చేసింది ఓ యువతి. విలాసాలకు అడ్డుగా ఉన్నాడంటూ వేధించి ఇంట్లో నుంచి 70 వేల నగదు, నాలుగు తులాల బంగారు ఆభరణాలతో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆరా తీయడంతో అమెకు అప్పటికే మూడు పెళ్లీళ్లు అయ్యాయని.. చాలా మందితో పరిచయాలు ఉన్నాయని తెలుసుకొని.. పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు.

Advertisement

పెద్దపల్లి జిల్లా రామగుండం రేవంత్ అనే పాన్ షాప్ యజమానికి అప్పటికే పెళ్లి జరిగి విడాకులు అయ్యాయి. అయితే ఓ షాదీ డాట్ కామ్ ద్వారా వరంగల్ జిల్లా కు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇలా ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. పెళ్లి తర్వాత మందు, సిగరెట్లు కావాలంటూ తనను నిత్యం వేధించేదని రేవంత్ ఆరోపించాడు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. రెండు నెలల తర్వాత యువతి తన అక్క దగ్గరికి వెళుతున్నానంటూ ఇంట్లో ఉన్న 70 వేల నగదు, 4 తులాల గోల్డ్ ఆభరణాలతో వెళ్లిపోయిందని రేవంత్ చెబుతున్నాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆరా తీయగా.. అసలు విషయాలు ఫోటోలతో బయటపడ్డాయి.

అప్పటికే ఆమెకు మూడు పెళ్లిలు అయ్యాయని, చాలా మందితో పరిచయాలు ఉన్నాయని తెలుసుకున్నానని చెబుతున్నాడు. చివరకు అడ్రస్ తెలుసుకుని వెళ్లడంతో ఆ యువతి తన మిత్రులతో కలిసి దాడి చేసి.. వీడియోలు తీసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలని లేదంటే.. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తున్నారని చెబుతున్నాడు. ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించి, తన గోడు వెలబోసుకున్నానని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు రేవంత్.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×