E-Paper
Advertisement

Vikarabad: అనంతగిరిలో అద్భుతమైన సరికొత్త విలాసం.. రూ. 1021 కోట్లతో ‘లావి’ అల్ట్రా లగ్జరీ రిసార్ట్!

Vikarabad: అనంతగిరిలో అద్భుతమైన సరికొత్త విలాసం.. రూ. 1021 కోట్లతో ‘లావి’ అల్ట్రా లగ్జరీ రిసార్ట్!
Advertisement

తెలంగాణ ఊటీగా పేరుగాంచిన వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు త్వరలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కళను సంతరించుకోనున్నాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) డైరెక్టర్ సుధారెడ్డి సారథ్యంలో.. దాదాపు రూ. 1,021 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘లావి’ (Lavie) అనే వరల్డ్ క్లాస్ అల్ట్రా-లగ్జరీ వెల్నెస్ రిసార్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రకృతి ఒడిలో విలాసవంతమైన జీవనశైలిని పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు..

Advertisement

ఈ రిసార్ట్‌లో మొత్తం 180 గదులు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి గదిని ఎంతో విలాసవంతంగా, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. కేవలం బస కోసమే కాకుండా, శారీరక, మానసిక ఉల్లాసం కోసం అత్యాధునిక వెల్నెస్ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి రమణీయత మధ్య ఈ రిసార్ట్ పర్యాటకులకు అద్భుతమైన ఆతిథ్యాన్ని అందించనుంది.

మిచెలిన్ స్టార్ స్థాయి భోజనం..

Advertisement

తాజా సమాచారం ప్రకారం, ఈ రిసార్ట్‌లో ప్రపంచ ప్రఖ్యాత మిచెలిన్ స్టార్ (Michelin-star) ప్రమాణాలకు తగ్గట్టుగా ఒక హై-ఎండ్ రెస్టారెంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అంతర్జాతీయ వంటకాలతో పాటు, విశిష్టమైన రుచులను పర్యాటకులకు అందించడం ద్వారా వికారాబాద్‌ను గ్లోబల్ ఫుడ్ మ్యాప్‌లో నిలపాలని యాజమాన్యం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.

అభివృద్ధి బాటలో అనంతగిరి సర్క్యూట్..

‘లావి’ రిసార్ట్‌ రాకతో అనంతగిరి పర్యాటక ప్రాంతం రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్‌ను అనుసరించి మరిన్ని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఈ పరిసరాల్లో తలెత్తే అవకాశం ఉంది. పర్యాటక రంగం విస్తరించడం వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటంతో, వీకెండ్ డెస్టినేషన్‌గా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి వెడ్డింగ్, బిజినెస్ కాన్ఫరెన్స్‌లకు కూడా అనంతగిరి ప్రధాన కేంద్రంగా మారనుంది.

ALSO READ: CJ Roy Confident Group:: ఐటీ సోదాలు జరిగిన కొన్ని గంటల్లోనే విషాదం.. ప్రముఖ వ్యాపారవేత్త ఆత్మహత్య.. ! 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×