E-Paper
Advertisement

PM Shehbaz Sharif: టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఇర‌గ‌దీయండి..రెచ్చ‌గొట్టిన‌ పాకిస్తాన్ ప్ర‌ధాని

PM Shehbaz Sharif: టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఇర‌గ‌దీయండి..రెచ్చ‌గొట్టిన‌ పాకిస్తాన్ ప్ర‌ధాని
Advertisement

PM Shehbaz Sharif:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( t20 world cup 2026) కంటే ముందు ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. ఈ టోర్నమెంట్ కంటే ముందు పాకిస్తాన్ జట్టుపై సంచలన పోస్ట్ పెట్టారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఆస్ట్రేలియాపై మొదటి టీ20 లో గెలిచిన పాకిస్తాన్ జట్టుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు షెహబాజ్ షరీఫ్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అంతేకాదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీకి ఫోన్ చేసి, ఇదే ఊపు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో కొనసాగించాలని వెల్లడించారు. దీంతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా జట్టు పైన ఒక్క మ్యాచ్ గెలిస్తేనే, ఇంత సంబరపడిపోతున్నారా..? ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తేనే ప్రధాని పోస్ట్ పెడతారా? ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ అంటూ ఆడుకుంటున్నారు ఇండియన్ ఫ్యాన్స్.

 Also Read:  Sanju Samson: సంజు శాంస‌న్ కు కోట్ల‌ల్లో ఆస్తులు, బంగ్లాలు, ఖ‌రీదైన కార్లు..కానీ ఒక్క‌ మ్యాచ్ ఆడ‌టం చేత‌కావ‌డం లేదు

పాకిస్తాన్ ప్రధాని ట్వీట్ వైరల్.. ఆడుకుంటున్న ఇండియన్ ఫాన్స్

Advertisement

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడు టి20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు ఈ సీరియస్ నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ లో జరుగుతున్న ఈ టోర్నమెంటులో మొదటి మ్యాచ్ నిన్న జరిగింది. గడాఫీ వేదికగా జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో, ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 22 పరుగుల తేడాతో మొదటి టి20 సొంతం చేసుకుంది పాకిస్తాన్. ఇలాంటి నేపథ్యంలోనే ఈ విజయం పై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వివాదానికి తెర లేపారు.

మొదటి టీ20 లో అద్భుతంగా గెలిచారు.. పాకిస్తాన్ జట్టు ఇదే ఊపును కొనసాగించాలి.. టి20 ప్రపంచ కప్ లో కూడా ఇలాగే ఆడతారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. పాకిస్తాన్ జట్టును ముందుండి నడిపిస్తున్న PCB చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీ పని తనం అద్భుతం అంటూ కితాబిచ్చారు. పాకిస్తాన్ క్రికెట్ టీం విజయం వెనుక నఖ్వీ కృషి అంతా ఇంతా కాదని వివరించారు. దీంతో ఇండియన్ ఫాన్స్ దారుణంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను ఆడుకుంటున్నారు.

Advertisement

ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ గెలిస్తేనే ఇంత సంబరపడిపోతున్నారా? ముందుంది ముసళ్ళ పండుగ.. టి20 ప్రపంచ కప్ లో గెలిచినంత ఫీల్ అవుతున్నారా ? మిస్టర్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంటూ ఆడుకుంటున్నారు. మీరు గెలిచింది ఆస్ట్రేలియా B జట్టు మాత్రమే.. దానికి హెడ్ కెప్టెన్ గా ఉన్నాడు… అది గుర్తుంచుకోండి… అసలు సిసలు ఆస్ట్రేలియా జట్టు బరిలో దిగితే, పాకిస్తాన్ తాట తీయడం గ్యారంటీ అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

 Also Read: WPL 2026-RCB Finals: ఫైనల్‌కు RCB..యూపీ ఎలిమినేట్..మిగిలిన జ‌ట్ల‌లో ఎవ‌రికి ఎంత ఛాన్స్, సినారియో ఇదే

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×