// // Rain Updates : భారీ వర్షం.. తెలంగాణ ఆగమాగం.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Rain Updates : భారీ వర్షం.. తెలంగాణ ఆగమాగం..

Rain Updates : భారీ వర్షం.. తెలంగాణ ఆగమాగం..
Advertisement
Rain Updates

Rain Updates : వరుసగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోయి.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాగసముందర్ దగ్గర రోడ్ పై ప్రమాదకరంగా వాగు ప్రవహిస్తోంది. దీంతో వికారాబాద్ రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు కోటపల్లి రిజర్వాయర్ నిండి అలుగు పారుతోంది.

Advertisement

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్ గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యాక్ వాటర్ రావడంతో పారిగాం మీదుగా వెళ్లే కౌటాల మండలం గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వెంకట్రావు -పోడ్సా అంతర్రాష్ట్ర వంతెన వరదనీటిలో మునిగిపోయింది. సిర్పూర్ మండలంలోని అంతర్రాష్ట్ర రహదారులను రెవెన్యూ అధికారులు పోలీసులు పరిశీలించారు. ఈ రహదారుల్లో ఎలాంటి ప్రయాణాలు సాగించకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాల్కొండ, భీంగల్, వేల్పూర్, కమర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు వేల్పూర్ చెరువుకు గండి పడింది. రాళ్ళ వాగు, కప్పల వాగు, పులాంగ్ వాగు, పెద్ద వాగు, కేశపూర్ వాగులు పొంగి పొర్లుతున్నాయి. భీంగల్ లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. అటు మాణిక్ బందర్ వద్ద వాగు కట్ట తెగిపోయింది.

Advertisement

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగరేణి సంస్థకు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సుమారు లక్ష టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తికి, 4 లక్షల టన్నులకు పైగా మట్టిని వెలికి తీసే పనులకు ఆటంకం కలిగింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×