// // union minister bandi sanjay serious allegations against owaisi and old city - Bandi Sanjay: ఓల్డ్ సిటీ.. కాదు.. ఉగ్రఅడ్డా: కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు -->
E-Paper
Advertisement

Bandi Sanjay: ఓల్డ్ సిటీ.. కాదు.. ఉగ్రఅడ్డా: కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు

Bandi Sanjay: ఓల్డ్ సిటీ.. కాదు.. ఉగ్రఅడ్డా: కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు
Advertisement

– ఒవైసీ కనుసన్నల్లోనే వారికి ఆశ్రయం
– వందేమాతరం పాడని ఒవైసీ సెక్యులరా?
– ఒక్కనాడు.. హిందూ పండగల్లో పాల్గొన్నాడా?
– హిందూ ఫోబియాలో ఒవైసీ ఫ్యామిలీ
– మదర్సాలు.. ముమ్మాటికీ ఉగ్ర అడ్డాలే
– కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూదొందే
– కేంద్రమంత్రి బండి సంజయ్

Owasi Brothers: హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఒవైసీ కనుసన్నల్లో ఉగ్రవాదుల అడ్డాగా మారిందని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌కు ఇస్లామోఫోబియా పట్టుకుందని, అందుకే మదర్సాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని శనివారం ఎంఐఎం పార్టీ మీటింగ్‌లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటరిచ్చారు. బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా కరీంనగర్‌లో సంజయ్ మీడియాతో మాట్లాడారు.

Advertisement

ఆయనది హిందూఫోబియానా?
తనకు ఇస్లామోఫోబియా లేదనీ, కానీ, ఒవైసీ మాత్రం హిందూ ఫోబియాతో తెగ ఇబ్బంది పడుతున్నాడని సంజయ్ వ్యాఖ్యానించారు. పోలీసులను తొలగించి, తనకు 15 నిముషాలు సమయమిస్తే, దేశంలోని హిందువులందరినీ నరికి చంపేస్తానని అన్న వ్యక్తికి హిందూఫోబియా ఉన్నట్లేనా? అని పరోక్షంగా అక్బరుద్దీన్ వ్యాఖ్యాలను గుర్తుచేశారు. ఒవైసీ సోదరులు గానీ, ఎంఐఎం పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు గానీ, ఏనాడూ వందేమాతర గీతాన్ని ఆలపించలేదని, ఏ ఫోబియా వాళ్లను ఆపుతుందో చెప్పాలని నిలదీశారు. హిందువులు లౌకిక విలువలను పాటిస్తూ, పీర్ల పండగ చేసుకుంటారని, కానీ ఒక్కనాడైనా ఒవైసీ వినాయకచవితి, దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారా? బొట్టు పెట్టుకుని హిందూ దేవతలకు నమస్కరించారా? అని ప్రశ్నించారు.

మదర్సాలే అడ్డాలు..
మదర్సాల గురించి తాను మాట్లాడితే ఒవైసీ తెగ బాధపడ్డాడని, అయితే ప్రపంచం మొత్తం బ్యాన్‌ చేసిన టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్‌ లీడర్‌‌‌గా పనిచేసే ఓ ఉగ్రవాది ఒవైసీ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ దొరికిన మాట నిజం కాదా అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్నోర్‌ మదర్సాలో 9 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి దగ్గరి నుంచి ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నారని గుర్తుచేశారు. అలాంటప్పుడు మదర్సాలు టెర్రరిస్టులను తయారు చేస్తున్నాయని అంటే అందులో ఒవైసీకి వచ్చిన బాధేమిటని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ టెర్రరిస్టులు పట్టుబడ్డా వారిలో కచ్చితంగా ఒక్కరికైనా హైదరాబాద్ ఓల్డ్ సిటీతో లింకులు ఉంటున్నాయని, ఓటు బ్యాంకు రాజకీయం కోసం రోహింగ్యాలకు, ఉగ్రవాదులకు ఎంఐఎం నేతలు ఆధార్, రేషన్ కార్డులిప్పించి ఆశ్రయం కల్పి్స్తున్న మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓల్డ్ సిటీలోని కొన్ని ముస్లిం వర్గాలు కూడా ఒవైసీ కుటుంబ నియంతృత్వ ధోరణితో విసిగిపోయాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఓల్డ్ సిటీని.. న్యూ సిటీగా మార్చుతానని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను అలాంటి ముస్లిం పెద్దలే స్వాగతించారని గుర్తు చేశారు. త్వరలో ఓవైసీకి, ఆయన కుటుంబానికి ఓల్డ్ సిటీ ప్రజలు బుద్ధి చెప్పి ఓడిస్తారని అన్నారు.

Advertisement

Also Read: KTR: సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఇది ఎలా ఇచ్చారు?: కేటీఆర్

హైడ్రాకి వ్యతిరేకం కాదు..
తాను హైడ్రాకి వ్యతిరేకం కాదని, అక్రమ కట్టడాలకు కారణమైన బీఆర్ఎస్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కూల్చివేతల విషయంలో రాజకీయ ప్రలోభాలు ఉండరాదని, అక్రమ నిర్మాణాలు ఏ పార్టీవారివైనా కూల్చాల్సిందేనన్నారు. అమృత్ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుంద‌న్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఓటుకు నోటుకు కేసు విచారణ ఎందుకు జరపలేదని, దీనిని బట్టి కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంద‌ని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ నెల 25 వరకు ఇది కొనసాగుతుందని తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×