E-Paper
Advertisement

Shamshabad Airport: అటెక్షన్ ప్లీజ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆ కేఫ్ ఓపెన్, కేవలం రూ. 10 లకే చాయ్

Shamshabad Airport: అటెక్షన్ ప్లీజ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆ కేఫ్ ఓపెన్, కేవలం రూ. 10 లకే చాయ్
Advertisement

Shamshabad Airport: ఎయిర్‌పోర్టుల్లో వస్తువుల ధరల గురించి చెప్పనక్కర్లేదు. విమానం ఎక్కడానికి వచ్చారంటే ఉన్నతస్థాయి వర్గానికి చెందినవారుగా భావిస్తుంటారు.  అక్కడి వస్తువుల రేట్ల గురించి చెప్పనక్కర్లేదు. ఇష్టానుసారంగా ప్రయాణికులపై ఎడాపెడా బాదుడు కార్యక్రమం ఉంటుంది. దీనిపై ప్రయాణికుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో దిద్దుబాటు చేపట్టింది ఎయిర్‌పోర్టు అథారిటీ.

Advertisement

విమాన ప్రయాణికులకు చక్కటి శుభవార్త

ఈ నేపథ్యంలో ఉడాన్ యాత్రి కేఫ్లను అందుబాటులోకి తెచ్చింది. తాజా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శనివారం నుంచి ఉడాన్ యాత్రి కేఫ్ఈ తన సేవలను ప్రారంభించింది.  అక్కడ టీ కేవలం పది రూపాయలు మాత్రమే. అదే కాఫీ కేవలం 20 రూపాయలు మాత్రమే. 

Advertisement

సామాన్య విమాన ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దేశంలోని ప్రముఖ ఎయిర్ పోర్టుల్లో వాటర్ మొదలు టీ, కాఫీ, స్నేక్స్, ఆహారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సామాన్యుడు కనీసం టీ తాగలేని పరిస్థితి ఉండేది. ఇదంతా ఒకప్పటి మాట.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆ కేఫ్ ఓపెన్

ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అధికంగా కావడంతో పార్లమెంటులో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో అటువైపు దృష్టి పెట్టింది కేంద్ర పౌర విమానయాన శాఖ. తక్కువ ధరల కేఫ్‌లను ఏర్పాటు చేస్తామని సదరు మంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2024 డిసెంబరులో కోల్‌కతా ఎయిర్‌పోర్టులో తొలి ‘ఉడాన్ యాత్రి కేఫ్‌’ ప్రారంభమైంది. 

అప్పటి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వంతైంది. శనివారం ఈ కేఫ్‌ అధికారంగా ఓపెన్ అయ్యింది. అక్కడ టీ కేవలం పది రూపాయలు మాత్రమే. ఇక కాఫీ అయితే రూ. 20లు. తక్కువ ధరలకు స్నాక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విమాన ప్రయాణికులకు అధిక ధరల నుంచి విముక్తి కలిగినట్టే.

ALSO READ:  సంక్రాంతి దోపిడీ.. ప్రైవేటు ట్రావెలర్స్ అరాచకం

శంషాబాద్ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ డిపార్చర్స్, చెక్-ఇన్ హాల్ గేట్ నంబర్ ఒకటి వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. విమానం ఎక్కేముందు ప్రయాణికులు తక్కువ ధరకు అల్పాహారం, స్నాక్స్ తీసుకోవచ్చు. ప్రయాణికుల సేవల నాణ్యతను పెంచడంలో ఉడాన్ యాత్రి కెఫ్ ప్రధాన అడుగుగా విమానాశ్రయ అధికారులు  చెబుతున్నారు.

దీనిపై ప్రయాణికులు హర్షం చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ లో విజయవాడ ఎయిర్‌పోర్టులో ఆ తరహా కేఫ్ ప్రారంభమైంది. ఆనాటి నుంచి ఈ కేఫ్‌లకు ప్రయాణికుల నుంచి మాంచి రెస్పాన్స్ వస్తోంది.  తొలుత మెట్రో సిటీల్లో అందుబాటులోకి రాగా, ఆ తర్వాత టూ టైర్ సిటీ ఎయిర్‌పోర్టులో విస్తరిస్తోంది ఎయిర్‌పోర్టు అథారిటీ.  

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×