E-Paper
Advertisement

IND VS NZ 1st ODI: అర్ధ‌రాత్రి న్యూజిలాండ్ ప్లేయ‌ర్ల రూంలోకి కోహ్లీ, రిష‌బ్ పంత్ స్థానంలో జురెల్

IND VS NZ 1st ODI: అర్ధ‌రాత్రి న్యూజిలాండ్ ప్లేయ‌ర్ల రూంలోకి కోహ్లీ, రిష‌బ్ పంత్ స్థానంలో జురెల్
Advertisement

IND VS NZ 1st ODI: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st ODI)  మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది. ఈ వన్డే సిరీస్ కోసం రంగంలోకి మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ( Dhruv Jurel ) దిగుతున్నాడు. నిన్న ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్ ( Rishabh Pant) గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో రిష‌బ్ పంత్ మూడు వన్డేల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే రిషబ్ పంత్ జట్టుకు దూరం కావడంతో అతని స్థానాన్ని వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తో భర్తీ చేస్తున్నట్లు తాజాగా ప్రకటన చేసింది బీసీసీఐ. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా అధికారిక ప్రకటన చేశారు.

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

న్యూజిలాండ్ ప్లేయర్లతో డిన్నర్ చేసిన విరాట్ కోహ్లీ

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాల్టి నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వడోదర కు చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్ పైన దృష్టి పెట్టాయి. అయితే నిన్న రాత్రి మాత్రం విరాట్ కోహ్లీ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. సాయంత్రం పూట న్యూజిలాండ్ ఉన్న హోటల్ రూమ్ కు విరాట్ కోహ్లీ వెళ్ళాడట. దాదాపు 6 గంటల పాటు వాళ్లతో గడిపి అక్కడే భోజనం కూడా చేసినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ అంటే న్యూజిలాండ్ ప్లేయర్లకు చాలా ఇష్టం. అయితే వాళ్ల ఆహ్వానం మేరకే విరాట్ కోహ్లీ వాళ్ళ హోటల్ రూమ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి అతిధి మర్యాదలు చేశారట. అంతేకాదు లిక్కర్ కూడా తాగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

రిషబ్ పంత్ ఔట్.. దరిద్రుడు వచ్చేశాడు

టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ అదృష్టం ఏమాత్రం బాగా లేనట్లే ఉంది. రాకరాక టీమ్ ఇండియా వన్డే జట్టులో ఛాన్స్ వస్తే, ప్రకృతి వెక్కిరించింది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతని నడుము దగ్గర తీవ్రమైన గాయమైనట్లు చెబుతున్నారు. అంతకుముందు ప్రాక్టీస్ సమయంలో సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టాడట రిషబ్ పంత్. ఆ తర్వాత ఓ నెట్ బౌలర్ వేసిన బంతి, బలంగా తగిలిందట. దీంతో వెంటనే రిషబ్ పంత్ ను ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 3 సిరీస్ నుంచి అతనిని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అంతేకాదు ఈ సంఘటన జరిగి 24 గంటలు కాకముందే రిషబ్ పంత్ స్థానంలో జురెల్ ను ఎంపిక చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది బీసీసీఐ. ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ ను సెలెక్ట్ చేస్తారనుకుంటే జురెల్ కు అవకాశం వచ్చింది. వాస్తవంగా కేఎల్ రాహుల్ ఈ జట్టులో ఉన్నాడు కాబట్టి జురెల్ కు అవకాశం రాబోదు. ఒకవేళ రాహుల్ ఆడక పోతే తప్ప, జురెల్ కు అవకాశం వచ్చే ఛాన్స్ లేదు.

Advertisement

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×