E-Paper
Advertisement

UBS Hyderabad: ఫీనిక్స్ సెంటారస్‌లో యూబీఎస్ అడుగు.. హైదరాబాద్ ఐటీ హబ్‌కు సరికొత్త బూస్ట్

UBS Hyderabad: ఫీనిక్స్ సెంటారస్‌లో యూబీఎస్ అడుగు.. హైదరాబాద్ ఐటీ హబ్‌కు సరికొత్త బూస్ట్
Advertisement

UBS Hyderabad: సివిస్ బ్యాంకింగ్ దిగ్గజం UBS (Union Bank of Switzerland) హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. గతేడాది జనవరిలో ఫీనిక్స్ అక్విలా (Phoenix Aquila)లో పది లక్షల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకున్న ఈ సంస్థ, ఇప్పుడు గచ్చిబౌలిలో మరో భారీ లీజు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ అయిన గచ్చిబౌలిలో 1,50,000 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని UBS లీజుకు తీసుకుంది. ఈ కొత్త కార్యాలయం ఫీనిక్స్ సెంటారస్ (Phoenix Centaurus) బిల్డింగ్‌లో ఏర్పాటు కానుంది. ఇది మైక్రోసాఫ్ట్ (Microsoft) కార్యాలయానికి అతి సమీపంలో ఉండటం గమనార్హం. గతేడాది ఫీనిక్స్ అక్విలాలో సుమారు 1.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో తన అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత, ఇది రెండో భారీ విస్తరణ.

Advertisement

హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs)కు ప్రధాన హబ్‌గా మారింది. UBS వంటి దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను విస్తరించడం వల్ల బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు టెక్నాలజీ రంగాలలో వేలాది మంది యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో గ్రేడ్-A ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ భారీగా పెరిగింది.

యూబీఎస్ అనేది స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థ. యూబీఎస్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ మరియు బాసెల్ నగరాల్లో ఉంది.ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వెల్త్ మేనేజ్‌మెంట్, అసెట్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. సంపద నిర్వహణ (Wealth Management) విభాగంలో యూబీఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుగా గుర్తింపు పొందింది.

Advertisement

Read Also: Hydra demolition: నార్సింగిలో హైడ్రా యాక్షన్.. పార్కు స్థలం కబ్జా చేస్తే కూల్చివేత తప్పదు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×