E-Paper
Advertisement

Hyderabad Crime: పెళ్లి కోసం తపన.. చివరికి 20వ అంతస్తు మీదకు ఎక్కి..

Hyderabad Crime: పెళ్లి కోసం తపన.. చివరికి 20వ అంతస్తు మీదకు ఎక్కి..
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 30 ఏళ్లు అయినా పెళ్లి కాకపోవడంతో తీవ్ర మనస్తాపంతో 20వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.

అత్తాపూర్‌లోని ఓ ప్రముఖ అపార్టెమెంట్‌లో నివాసం ఉంటున్న ప్రవీణ్ అనే యువకుడు.. గత కొంత కాలంగా తన పెళ్లి విషయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వయసు పెరుగుతున్నా సరైన సంబంధం కుదరకపోవడం.. తోటివారికి వివాహాలు జరిగిపోవడంతో అతను తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు.

Advertisement

ఆదివారం సాయంత్రం తన నివాసముంటున్న 20వ అంతస్తు నుండి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. దీంతో ప్రవీణ్ అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భారీ శబ్ధం రావడంతో అపార్టెమెంట్ వాసులు బయటకు వచ్చి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రవీణ్‌ను చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:100 కోట్ల ఒప్పందమా? ఆధారాలు చూపండి! బండి సంజయ్‌పై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×