E-Paper
Advertisement

ORR వద్ద ఘోర ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి!

ORR వద్ద ఘోర ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి!
Advertisement

Medchal: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్ (ORR) అండర్‌బ్రిడ్జి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సుమారు 11:50 గంటల సమయంలో కొంపల్లి వైపు వెళ్లే మార్గంలో కండ్లకోయ ORR అండర్‌బ్రిడ్జి వద్ద TS08GU9850 నంబర్ గల పియాజియో ఏప్రిలియా ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో సొహైల్ (18), సుమిత్ గైక్వాడ్ (17) తీవ్ర గాయాల పాలై ఘటన స్థలంలోనే మృతి చెందారు.

Advertisement

మృతుడు సొహైల్ దిల్‌కుష్‌నగర్‌లోని ఎస్. వి. మోడల్ హైస్కూల్ ప్రాంతానికి చెందిన వాడిగా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కాగా, మరో మృతుడు సుమిత్ గైక్వాడ్ కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ప్రమాదానికి కారణమై అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని, దీనిపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Also Read: భ‌ర్త‌ను చంపి రీల్స్ చూస్తూ భార్య ఎంజాయ్.. కొడుకుపై కత్తితో దాడి, కర్ణాటకలో దారుణం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×