E-Paper
Advertisement

హీరో వీడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఏ వేరియంట్ బెస్ట్ అంటే?

హీరో వీడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఏ వేరియంట్ బెస్ట్ అంటే?
Advertisement

Hero Vida VX2 Variants: హీరో.. తన వీడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను మొత్తం ఐదు వేరియంట్లలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వేరియంట్లను గో, ప్లస్  అనే రెండు సిరీస్‌ లుగా విభజించింది. అన్ని వేరియంట్లలో 6kW ఎలక్ట్రిక్ మోటార్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాటరీలను అవసరమైతే సులభంగా తీసివేసే విధంగా రూపొందించారు. బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, బ్రేకింగ్ సిస్టమ్, డిస్‌ ప్లే, రైడింగ్ మోడ్‌ల విషయంలో కాస్త తేడాలు ఉన్నాయి. ఇంతకీ ఏ వేరియంట్ ప్రత్యేకత ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1.Vida VX2 Go 2.2

ఇది ఎంట్రీ లెవల్ వేరియంట్. ఇందులో 2.2kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 93 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 4.2 సెకన్లలో అందుకుంటుంది. ఈ వేరియంట్‌తో 580W ఛార్జర్ లభిస్తుంది. దీని ద్వారా బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 3 గంటల 7 నిమిషాలు పడుతుంది. దీని ధర రూ.99,490.

2.Go 2.2 RQ

Advertisement

అటు ఈ వేరియంట్‌ లో 1000W ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు.  అదే ఛార్జింగ్ సమయం 1 గంట 41 నిమిషాలకు తగ్గుతుంది.  డ్రమ్ బ్రేకులు, CBS బ్రేకింగ్ సిస్టమ్, 4.3 అంగుళాల LCD డిస్‌ప్లే, ఎకో, రైడ్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.  33.2 లీటర్ల అండర్‌ సీట్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. Go 2.2 RQ ధర రూ.1.04 లక్షలు.

3.Vida VX2 Go 3.4

ఈ వేరియంట్‌లో 3.4kWh బ్యాటరీ ఉంటుంది. రేంజ్ 146 కిలోమీటర్లకు పెరుగుతుంది. గరిష్ట వేగం, యాక్సిలరేషన్ మాత్రం Go 2.2 మాదిరిగానే ఉంటాయి. ఇదీ 580W ఛార్జర్‌ తో  వస్తుంది. పెద్ద బ్యాటరీ కారణంగా 0-80 శాతం ఛార్జ్ కావడానికి 4 గంటల 44 నిమిషాలు పడుతుంది.  అండర్‌సీట్ స్టోరేజ్ 27.2 లీటర్లు ఉంటుంది. మిగతా ఫీచర్లు Go 2.2తో సమానంగా ఉంటాయి. దీని ధర రూ.1.21 లక్షలు.

4.Vida VX2 Plus 3.4

Advertisement

ఈ వేరియంట్ కూడా 3.4kWh బ్యాటరీనే ఉపయోగిస్తుంది. కానీ, ఇందులో మరిన్ని ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్, 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే, అలాగే ఎకో, రైడ్‌తో పాటు స్పోర్ట్ మోడ్ కూడా అందించారు. ఈ స్కూటర్ గరిష్ట వేగం 80 కిలోమీటర్లు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.1 సెకన్లలో అందుకుంటుంది. ఛార్జింగ్ సమయం 4 గంటల 44 నిమిషాలు. దీని ధర రూ.1.31 లక్షలు.

5.Vida VX2 Plus 4.4

ఇది ఈ సిరీస్‌లో అత్యంత ప్రీమియం వేరియంట్. ఇందులో 4.4kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 187 కిలోమీటర్ల IDC రేంజ్ లభిస్తుంది. ఈ వేరియంట్‌తో 1000W ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. దీంతో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 3 గంటల 17 నిమిషాలు మాత్రమే పడుతుంది. ముందు డిస్క్ బ్రేక్, TFT డిస్‌ప్లే, మూడు రైడింగ్ మోడ్‌లు ఇందులో కూడా ఉంటాయి. గరిష్ట వేగం 90 కిలోమీటర్లు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.1 సెకన్లలో అందుకుంటుంది. దీని ధర రూ.1.51 లక్షలు.

Read Also: పాత కార్లలో వినైల్ రూఫ్‌లు.. స్టైల్ కోసమా? అవసరం కోసమా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×