E-Paper
Advertisement

TSPSC : తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్ష.. అభ్యర్థులపై ప్రత్యేక నిఘా..

TSPSC : తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్ష.. అభ్యర్థులపై ప్రత్యేక నిఘా..
Advertisement

TSPSC : తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్ష జరిగింది. మొత్తం 994 కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది.

Advertisement

టీఎస్‌ఆర్టీసీ ప్రత్యే బస్సులు ఏర్పాటు చేసి అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు తరలించింది. అభ్యర్థులను నిశితంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి పంపించారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించలేదు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు.

ఉదయం 8.30 గంటల నుంచి 10.15 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఆ తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపించారు. ఇలా హైదరాబాద్‌ మసాబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ నుంచి ఓ అభ్యర్థిని, సిద్ధిపేటలో మరో అభ్యర్థిని పరీక్షకు అనుమతించలేదు.

Advertisement

మొత్తం 503 గ్రూపు-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. తొలుత అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. అప్పుడు 2.86 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 25,050 మంది మెయిన్స్‌ కు అర్హత సాధించారు. ఇంతలో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ ను అధికారులు రద్దు చేశారు. తాజా ప్రిలిమ్స్‌ పరీక్షలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ వార్నింగ్ ఇచ్చింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×