E-Paper
Advertisement

IAS Transfers: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. సీఎస్ ఉత్తర్వులు జారీ

IAS Transfers: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. సీఎస్ ఉత్తర్వులు జారీ
Advertisement

IAS Transfers: రాష్ట్ర పరిపాలనలో భాగంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణ రావు జీవోను విడుదల చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బదిలీల వివరాలు:

  • సబ్యసాచి ఘోష్ (1994 బ్యాచ్): ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా (All, DD & F) ఉన్న ఘోష్ ను.. ‘ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్‌మెంటల్ స్కీమ్స్ యూనిట్’ ఇంప్లిమెంటేషన్ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. అలాగే, ఈయన సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) కూడా కొనసాగిస్తారు.
  • అనితా రామచంద్రన్ (2004 బ్యాచ్): మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్ కు, అదే శాఖ కార్యదర్శిగా, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • ఇలంబరితి కె (2005 బ్యాచ్): మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) శాఖ కార్యదర్శిగా ఉన్న ఈయనను ప్రభుత్వ కార్యదర్శిగా బదిలీ చేశారు. అదనంగా, (All, DD & F) శాఖ కార్యదర్శిగా కూడా FAC బాధ్యతలు అప్పగించారు.
  • బి. శ్రీధర్ (2004 బ్యాచ్): బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఈయనను, సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ (GA Dept) కార్యదర్శిగా నియమించారు.
  • డా. యశ్మీన్ బాషా (2015 బ్యాచ్): హార్టికల్చర్ & సెరికల్చర్ డైరెక్టర్‌గా ఉన్న ఈమెకు, టీజీ ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • జి. జితేందర్ రెడ్డి: ఆదిలాబాద్ జెడ్పీ సీఈవోగా ఉన్న ఈయనను ఎస్సీడీ శాఖ స్పెషల్ కమిషనర్‌గా నియమించారు. దీంతో పాటు, టీజీ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీసీ & ఎండీగా కూడా FAC బాధ్యతలు ఇచ్చారు.
  • బి. సైదులు (IFS-2005): ఎంజేపీ(టి)బీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శిగా ఉన్న ఈయనను ‘ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్‌మెంటల్ స్కీమ్స్ యూనిట్’ స్పెషల్ సెక్రటరీగా FACలో నియమించారు.
  • MA&UD శాఖ కార్యదర్శి పోస్టు పూర్తి అదనపు బాధ్యతలు చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణ రావు వద్దే కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×