// // SS Rajamouli - రాజమౌళి ఓ రోడ్డు కాంట్రాక్టర్.. -->
E-Paper
Advertisement

SS Rajamouli: రాజమౌళి ఓ రోడ్డు కాంట్రాక్టర్… తోటి డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి ?

SS Rajamouli: రాజమౌళి ఓ రోడ్డు కాంట్రాక్టర్… తోటి డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి ?
Advertisement

Prashanth Neel Calls Rajamouli Is Road Contractor: దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మల్టిస్టార్‌ చిత్రం బాహుబలి ఈ రోజు రీ రిలీజైంది. 2015లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిన ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీ స్థాయిలో అక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఈ మూవీతో పాన్‌ ఇండియా అంటూ భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త ట్రెండ్‌ని పరిచయం చేశాడు జక్కన్న. ఎపిక్‌ యాక్షన్ డ్రామా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వెయ్యి కోట్లపైనే వసూళ్లు చేసి టాలీవుడ్‌ని అగ్ర స్థానంలో నిలబెట్టింది.

టాలీవుడ్‌ తొలి వెయ్యి కోట్ల సినిమా..

Advertisement

ఈ దెబ్బతో జక్కన్న పేరులో ఇంటర్నేషనల్‌ వైడ్‌గా మారుమ్రోగింది. ఇక ప్రభాస్‌, రానాలకు గ్లోబల్‌ స్టార్లుగా నిలబెట్టిన ఈ చిత్రం ఈ రోజు మళ్లీ థియేటరల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్‌’ (Baahubali: The Epic) పేరుతో రీ–రిలీజ్‌ చేశారు. రెండు భాగాలున్న ఈ సినిమా ఎడిట్‌ చేసి ఒక్క పార్ట్‌గా విడుదల చేశారు. ఇందులో కొన్ని సీన్లు కట్‌ చేసి కొత్త సీన్లు యాడ్‌ చేసి ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని అందించారు.

గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న కొత్త సీన్స్

ఈ రోజు రీ రిలీజ్ అయిన ఈ సినిమాపై ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రివ్యూస్‌ వస్తున్నాయి. ఈ సందర్భంగా టాలీవుడ్‌ సినీ దిగ్గజాలు సైతం బాహుబలి: ది ఎపిక్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాహుబలి చిత్రంతో రాజమౌళి ఇండస్ట్రీలో హద్దులు చెరిపేశారని, పాన్‌ ఇండియా అంటూ ఇండియన్‌ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారంటున్నారు. బాహుబలి రెండు భాగాలు ఎంత అద్భుతం చేశాయో.. బాహుబలి: ది ఎపిక్‌ కూడా మరో సంచలనం అంటూ కొనియాడుతున్నారు. కొత్తగా యాడ్‌ అయిన సీన్స్‌ కూడా గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయంటూ ఆడియన్స్‌ రివ్యూ ఇస్తున్నారు. అలాగే బాహుబలి: ది ఎపిక్‌ పై డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ రివ్యూ ఇస్తూ జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ రోడ్డు కాంట్రాక్టర్‌ రాజమౌళినే

Advertisement

బాహుబలి సినిమాను పొగుడుతూనే జక్కన్నను రోడ్డు కాంట్రాక్టర్‌ అని పిలిచారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ఇవాళ బాహుబలి: ది ఎపిక్‌ చూసిన ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమా ఇండస్ట్రీని రోడ్డుగా, రాజమౌళిని రోడ్డు కాంట్రాక్టర్‌ అని పిలిచాడు. ఇంతకి అసలేం అయ్యిందంటే. సినిమా చూసిన ఆయన బాహుబలి: ది ఎపిక్‌ పై ఇలా రివ్యూ ఇచ్చారు. ‘ఒక రోడ్డుకు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. దీంతో అందరూ కలిసి ఓ కాంట్రాక్టర్ను పిలిచారు. ఆ కాంట్రాక్టర్ ఆ రోడ్డుకు మరమ్మతులు చేయడమే కాకుండా.. ఏకంగా దాన్ని 16 వరుసల హైవేగా మార్చేశాడు. ఆ రోడ్డు ఏదో కాదు.. పాన్ ఇండియా, ఆ కాంట్రాక్టర్ మరెవరో కాదు రాజమౌళినే‘ అంటూ ప్రశాంత్‌ వర్మ తన పోస్టులో రాసుకొచ్చారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×