E-Paper
Advertisement

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ఐదుసార్లు దాడి.. ట్రెయినీ ఐపీఎస్ కేసులో సంచలనాలు!

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ఐదుసార్లు దాడి.. ట్రెయినీ ఐపీఎస్ కేసులో సంచలనాలు!
Advertisement

IPS Trainee Case: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో అధికారులు సంచలన వివరాలు పేర్కొన్నారు. ఇన్‌ స్టాగ్రాం ద్వారా ఆయనకు మహిళా ట్రెయినీ ఐపీఎస్ తో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ తర్వాత జాతీయ పోలీస్ అకాడమీలో వారు దగ్గరయ్యారని పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ గా మారిన ఉదయ్ కృష్ణారెడ్డి జీవిత చరిత్ర చూసి మహిళా ట్రెయినీ ఐపీఎస్ పరిచయం పెంచుకున్నారని వెల్లడించారు. ఇరువురి మధ్య చాలాకాలం పాటు సంబంధాలు కొనసాగాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

అయితే కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చాయని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఇతరులతో మాట్లాడితే మహిళా అధికారిణిని ఉదయ్ కృష్ణారెడ్డి వేధించేవారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో దాడి కూడా చేసినట్టు పేర్కొన్నారు. సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో వీరు విడిపోయారని వెల్లడించారు. ముస్సోరీలో జరిగిన ట్రైనింగ్‌లో మళ్లీ కలుసుకున్నారని తెలిపారు. అప్పటినుంచి వీరి మధ్య సంబంధాలు కొనసాగాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

Advertisement

కొద్దిరోజులు బాగానే ఉన్నా తర్వాత మహిళా ట్రెయిని ఐపీఎస్‌‌ ను ఉదయ్ కృష్ణారెడ్డి తరచూ అనుమానంతో వేధించేవాడని చెప్పారు. ఉదయ్ కృష్ణారెడ్డి తీరుతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వెల్లడించారు. మళ్లీ ఎమోషనల్‌గా ఆమెకు దగ్గరయ్యారని అన్నారు. ఐదుసార్లు మహిళా ట్రైనీ ఐపీఎస్‌‌ను కొట్టాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత కూడా అతని తీరు మారలేదన్నారు. దాంతో వారిద్దరి మధ్య మళ్లీ విభేదాలు వచ్చాయని తెలిపారు. నేషనల్ పోలీస్ అకాడమీలో అధికారులకు ఇంటర్నల్‌గా మహిళా ట్రెయినీ ఐపీఎస్‌‌ ఫిర్యాదు చేశారని వెల్లడించారు.

Also Read: కొత్త ఈ-స్కూటర్ కావాలా? మార్కెట్‌ను షేక్ ఆడించే మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

Advertisement

ఇక, మహిళా ట్రెయినీ ఐపీఎస్‌కు మే నెలలో వివాహం జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి మరింతగా ఆమెకు వేధింపులు పెరిగాయని చెప్పుకొచ్చారు. దాంతో బాధితురాలు తన భర్త సహకారంతో అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే మరికొంత మంది అమ్మాయిలతో ఉదయ్ కృష్ణారెడ్డి చాటింగ్ చేసినట్లుగా గుర్తించామని చెప్పారు. చాలామంది యువతులను ఉదయ్ వేధించారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు తన స్వగ్రామంలో కూడా కొంతమంది అమ్మాయిలను ఉదయ్ కృష్ణారెడ్డి వేధించారని వెల్లడించారు. పోలీస్ అకాడమీలో ట్రెయినింగ్‌లో మహిళా ఐపీఎస్ అధికారులను కూడా ఉదయ్ కృష్ణారెడ్డి వేధించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Also Read: సినిమాలు, జూలో కాకుండా.. పులిని అడవిలో చూడాలా? ఈ ప్రాంతాలకు వెళ్లు మామ!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×