E-Paper
Advertisement

Jhansi Reddy: పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డికి వరుస షాకులు.. దేవరుప్పులలో కాంగ్రెస్ రెబల్ ఘన విజయం

Jhansi Reddy: పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డికి వరుస షాకులు.. దేవరుప్పులలో కాంగ్రెస్ రెబల్ ఘన విజయం
Advertisement

Jhansi Reddy: పాలకుర్తి నియోజకవర్గంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఎర్రబెల్లి ఝాన్సీ రెడ్డికి సొంత పార్టీ నుంచే నిరసన సెగలు తగులుతున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆమెకు వరుస షాకులను ఇస్తున్నాయి. గత రెండు విడతల ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఆమె బలపరిచిన పలువురు అధికారిక అభ్యర్థులు ఓటమి పాలవగా, తాజాగా మూడో విడతలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన దేవరుప్పుల మేజర్ గ్రామపంచాయతీలో ఆమెకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఇక్కడ ఝాన్సీ రెడ్డి తన ముఖ్య అనుచరుడైన జక్కుల గంగరాజును కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా బరిలోకి దించారు. అయితే, స్థానిక కాంగ్రెస్ శ్రేణుల మద్దతు ఉన్న పెద్ది కృష్ణమూర్తి గౌడ్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఫలితాలు వెలువడ్డాక ఝాన్సీ రెడ్డికి షాక్ తగిలేలా.. ఆమె బలపరిచిన అభ్యర్థి గంగరాజు ఏకంగా మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కృష్ణమూర్తికి, బీఆర్ఎస్ అభ్యర్థి సుందర్‌కు మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగింది. చివరికి 870 ఓట్ల భారీ మెజారిటీతో రెబల్ అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఘన విజయం సాధించారు.

Advertisement

గత రెండు విడతల్లోనూ పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఝాన్సీ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రెబల్స్ బరిలోకి దిగి విజయాలు సాధించారు. క్షేత్రస్థాయి కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారనే అసంతృప్తి క్యాడర్‌లో ఉంది. దానికి నిదర్శనమే దేవరుప్పుల ఫలితం. ఝాన్సీ రెడ్డి అభ్యర్థి ఓడిపోయినప్పటికీ, గెలిచింది కాంగ్రెస్ రెబల్ కావడంతో దేవరుప్పుల మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. ఒక టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఉండి, సొంత నియోజకవర్గంలో వరుసగా మూడు విడతల్లోనూ తన వర్గాన్ని గెలిపించుకోలేకపోవడం రాజకీయంగా ఆమెకు ఇబ్బందికర పరిణామమేనని విశ్లేషకులు అంటున్నారు.

Read Also: BRS On Mlas Defection: ఏకపక్షంగా స్పీకర్ తీర్పు.. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టుకెళ్తాం-బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×