E-Paper
Advertisement

Mahesh Kumar: తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు.. బీఆర్ఎస్ పని ఖతం, మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar: తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు.. బీఆర్ఎస్ పని ఖతం, మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రావడం అసాధ్యమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియా చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై తనదైన విశ్లేషణను వినిపించారు.

రాష్ట్రంలో బీజేపీ అంతంత మాత్రమే..

Advertisement

పక్క రాష్ట్రమైన కర్ణాటకలో బీజేపీకి ఉన్నంత బలం తెలంగాణలో లేదని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్ని గొడవలు చేసినా, ఎంతగా కోట్లాడినా ప్రజలు ఆ పార్టీని ఆదరించే స్థితిలో లేరన్నారు. తెలంగాణ సామాజిక, రాజకీయ పరిస్థితులు బీజేపీ సిద్ధాంతాలకు అనుకూలం కాదని, ఇక్కడ ఆ పార్టీ ఎప్పటికీ అధికారానికి ఆమడ దూరంలోనే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పతనం షురూ…

Advertisement

బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయిందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, అందుకే కేటీఆర్ వంటి నాయకులు కేవలం సోషల్ మీడియాను పట్టుకొని పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు బీఆర్ఎస్‌ను విస్మరించారని.. కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రస్తావిస్తూ.. అక్కడ బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదని, ప్రధాన పోరు కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాలపై స్పందిస్తూ.. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపిక ప్రక్రియ ఇంకా పెండింగ్‌లోనే ఉందని ఆయన తెలిపారు. సరైన సమయంలో సమర్థులైన నాయకులను ఎంపిక చేస్తామన్నారు. అలాగే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీలో రాజకీయ సంస్థాగత మార్పులపై చర్చించామని అన్నారు. అయితే నైని కోల్ బ్లాక్ కేటాయింపులపై ఎటువంటి చర్చ జరగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ALSO READ: Komatireddy Venkat Reddy: నేనే విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు మూసేస్తా: మంత్రి కోమటిరెడ్డి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×