E-Paper
Advertisement

ఇంటర్ ఫలితాల్లో తొర్రూరు విద్యార్థి ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో తొర్రూరు విద్యార్థి ప్రభంజనం
Advertisement

Inter Toppers: స్వేచ్ఛ బ్యూరో: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్ష ఫలితాల్లో తొర్రూరుకు చెందిన గడల రామ్ చరణ్ బైపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో నాలుగవ ర్యాంకు సాధించాడు. హనుమకొండలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రామ్ చరణ్ ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో బైపీసీ విభాగంలో మొత్తం 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బైపీసీ విభాగంలో నాలుగవ ర్యాంకు దక్కించుకున్నాడు.

అత్యధిక మార్కులు

గత సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో గడల రామ్ చరణ్ 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. అదేవిధంగా ఇంటర్ ఫలితాల్లో హనుమకొండలోని ప్రతిభ జూనియర్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి విజయ దుందుభి మోగించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఎం అంజలి అనే విద్యార్థిని 994 మార్కులు సాధించి ప్రధమ స్థానంలో నిలిచింది. అలాగే జి కీర్తన అనే విద్యార్థిని 991 మార్కులు సాధించింది.

Advertisement

Also Read: సొంత పార్టీ నేతలపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీలొకి భారీ వలసలంటూ..!

ప్రతిభ జూనియర్ కళాశాల

ఇంటర్ పదవ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను ఏ శ్రావణి అనే విద్యార్థిని 466 మార్కులు, వి తిరుపతి అనే విద్యార్థి 465 మార్కులు, ఈ తరుణ్ అనే విద్యార్థి 461 మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ప్రతిభ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కళాశాల డైరెక్టర్లు కెఎల్ఎన్ ఆచార్య, కేతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, శ్రవణ్ రావు, తిరుపతి తదితరులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి తమ ప్రతిభ కళాశాల ప్రత్యేకతను మరోసారి విద్యాలోకానికి చాటిచెప్పిన తమ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Also Read: గద్వాల్లో మెరిసిన ఆణిముత్యాలు.. రెండేళ్ల రికార్డును బ్రేక్ చేసిన ఇంటర్ విద్యార్ధులు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×