E-Paper
Advertisement

Hair Growth tips: వేసవిలో జుట్టు రాలిపోకుండా సులువైన హెయిర్ గ్రోత్ చిట్కాలు

Hair Growth tips: వేసవిలో జుట్టు రాలిపోకుండా సులువైన హెయిర్ గ్రోత్ చిట్కాలు
Advertisement

వేసవి కాలం మొదలైతే చాలా మందికి జుట్టు సమస్యలు కూడా మొదలవుతాయి. ఎక్కువ వేడి, చెమట, కాలుష్యం వల్ల జుట్టు బలహీనంగా మారి రాలిపోవడం, డ్రైగా మారడం, డ్యాండ్రఫ్ సమస్యలు రావడం సహజం. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఖరీదైన షాంపూలు, ట్రీట్మెంట్స్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మన ఇంటి కిచెన్‌లోనే ఉన్న కొన్ని సాధారణ పదార్థాలతో జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

మెంతులు – పెరుగు
మెంతులు, పెరుగు కలిపిన మాస్క్ గురించి చెప్పాలి. మెంతుల్లో ప్రోటీన్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు వేర్లను బలపరచడంలో సహాయపడతాయి. పెరుగు తల చర్మాన్ని శుభ్రంగా ఉంచి, చల్లదనం ఇస్తుంది. మెంతులు రాత్రంతా నానబెట్టి పేస్ట్ చేసి, అందులో పెరుగు కలిపి తలకు రాసుకోవాలి. అరగంట తర్వాత కడిగితే జుట్టు మృదువుగా, బలంగా మారుతుంది.

Advertisement

ఉల్లిపాయ రసం- తేనే
ఉల్లిపాయ రసం, తేనె మిశ్రమం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. ఇది హెయిర్ ఫాలికల్స్‌ను బలపరుస్తుంది. తేనె తల చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి పొడిబారకుండా కాపాడుతుంది. ఉల్లిపాయ రసం తీసుకుని, అందులో కొద్దిగా తేనె కలిపి తలకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గి, వేగంగా పెరుగుతుంది.

Also read: Tomato Sauce: మీరు కొన్న కొన్న టమోటా కెచప్ మంచిదో కల్తీదో చూసుకోండి, మార్కెట్లో భారీగా కల్తీ సరుకు

Advertisement

వేసవిలో తల చర్మం వేడి వల్ల ఇబ్బంది పడుతుంది. అలాంటప్పుడు అలొవెరా, ఆముదం ఆయిల్ మిశ్రమం చాలా ఉపయోగపడుతుంది. అలొవెరా జెల్ తల చర్మాన్ని చల్లబరుస్తుంది, మలినాలను తొలగిస్తుంది. క్యాస్టర్ ఆయిల్ రక్త ప్రసరణను పెంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ రెండింటిని కలిపి తలకు మసాజ్ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

కొబ్బరినూనె – కరివేపాకులు
కరివేపాకు, కొబ్బరి నూనె కూడా జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. కరివేపాకులో ఉన్న పోషకాలు జుట్టు బలంగా పెరగడానికి సహాయపడతాయి. కొబ్బరి నూనె జుట్టును లోతుగా పోషిస్తుంది. కొబ్బరి నూనెలో కరివేపాకును మరిగించి చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గి, మందంగా పెరుగుతుంది.

Also Read: Coffee: మీకు రోజూ కాఫీ తాగే అలవాటుందా? ఇది చర్మాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసా?

వేవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. తలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువ చెమట పడితే తలస్నానం చేయాలి. రోజూ తగినంత నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉండి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. హీట్ స్టైలింగ్ పరికరాలు తగ్గించడం మంచిది. అలాగే తరచూ తల మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు బలంగా పెరుగుతుంది.

జుట్టు సమస్యల కోసం ఖరీదైన ఉత్పత్తులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో సులభంగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ చిట్కాలను క్రమంగా పాటిస్తే జుట్టు రాలడం తగ్గి, మృదువుగా, పొడవుగా పెరుగుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×