E-Paper
Advertisement

Huge Traffic Jam @ Medaram: మేడారం వైపు భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

Huge Traffic Jam @ Medaram: మేడారం వైపు భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
Advertisement

Huge Traffic Jam At Medaram

Huge Traffic Jam At Medaram Jatara 2024: మేడారం మహాజాతరకు భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. సమ్మక్క- సారలమ్మ గద్దెలపైకి చేరడంతో జాతరకు భారీగా జనాలు తరలివచ్చారు. దీంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దారులన్నీ మేడారిని అన్నట్లుగా.. వనదేవతల దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారం- తాడ్వాయి మధ్య సుమారు 15 కిలోమీటర్ల మేర, వస్రా నుంచి గోవిందరావుపేట వరకు ఐదు కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Advertisement

మేడారం నుంచి వచ్చి పోయే దారులు గుండా వాహనాలు ముందుకు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు , భక్తుల రద్దీని నియంత్రించేందుకు తిరుగు ప్రయాణంలో నార్లపూర్ నుంచి బయ్యక్కపేట, భూపాలపల్లి మండలం దూదేకులపల్లి నుంచి గొల్లబుద్దారం, రాంపూర్ మీదుగా కమలాపూర్ క్రాస్ రోడ్డ వరకు వన్ వే రహదారిని ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాహనాలు కాటారం మీదుగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

గుండెపోటుతో ఇద్దరు భక్తుల మృతి..
మేడారం జాతరలో గుండెపోటుతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. వారికి తీవ్ర ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉచిత వైద్య శిబిరానికి తరలించారు. అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతులు పెద్దపల్లి జిల్లాకు చెందిన లక్ష్మి(68), విజయవాడకు చెందిన సాంబయ్య(40)గా పోలీసులు గుర్తించారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×