// // TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రీన్ సిగ్నల్! -->
E-Paper
Advertisement

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నిధుల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నిధుల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్!
Advertisement

TGSRTC: స్వేచ్ఛ బ్యూరో: రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్, సీనియర్ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాయ వంజరి కృష్ణ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావుతో కలిసి టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన ఎండీ ఈ నెల నుంచే బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

ఎలక్ట్రిక్ బస్సులుగా..

హైదరాబాద్ నగరంలో 240 ఆర్టీసీ బస్సులకు కిట్లు అమర్చి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి త్వరలో రోడ్లపైకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీని ద్వారా సుమారు 500 మంది డ్రైవర్లకు ఉపాధి లభించనుందని పేర్కొన్నారు. టీజీఎస్ ఆర్టీసీ టెక్నికల్ విభాగం పనితీరును దేశవ్యాప్తంగా ఇతర ఆర్టీసీ సంస్థలు పరిశీలిస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ మనుగడ, అభివృద్ధిపై ఫోరం ప్రతినిధులతో చర్చించి, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక సంఘాలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

Advertisement

Also Read: గజ్వేల్ వెళ్లాలంటే గజ గజ వణకాల్సిందే.. మృత్యు శాపంగా మారిన గొల్లపల్లి రోడ్డు

పెన్షన్ అంశం

అలాగే బర్కత్‌పురలోని రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ సురేష్‌ను కలిసి హయ్యర్ పెన్షన్ అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఈ నెలలో హయ్యర్ పెన్షన్‌కు చెల్లింపులు చేసిన వారికి మంజూరు చేస్తామని, అనంతరం పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Advertisement

Also read: అవమానాలకు అడ్డ బీఆర్ఎస్ పార్టీ: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×