E-Paper
Advertisement

Seed Farms Land: రాష్ట్రంలో కబ్జాల పాలైతున్న సీడ్ ఫాం భూములు.. త్వరలో ప్రభుత్వానికి పూర్తి నివేదిక..!

Seed Farms Land: రాష్ట్రంలో కబ్జాల పాలైతున్న సీడ్ ఫాం భూములు.. త్వరలో ప్రభుత్వానికి పూర్తి నివేదిక..!
Advertisement

Seed Farms Land: స్వేచ్ఛ బ్యూరో: వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం ఆక్రమణ దారుల పాలిట వరంగా మారుతుంది. నిత్యం పర్యవేక్షణ చేయాల్సి ఉంది.. అంతేకాదు భూ రక్షణ కోసం చుట్టూ పెన్సింగ్ వేయాల్సి ఉంది. కానీ ఆ చొరవ తీసుకోకపోవడంతో 65 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. కొంతమంది ఆక్రమణ దారులు ఏకంగా భూభారతిలో ఆన్ లైన్ చేసుకోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న రైతు కమిషన్ సీరియస్ అయింది. అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఒకటిరెండ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో 8 సీడ్ ఫామ్స్..

రాష్ట్రంలో 8 సీడ్ ఫామ్స్ ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వం 1629 ఎకరాలకు కేటాయించింది. కామారెడ్డి జిల్లాలోని బొప్పాసపల్లిలో 472.33 ఎకరాలు, మల్తుమేడలో 706.07 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో 24.8 ఎకరాలు, గద్వాల జిల్లాలోని కుర్విపాడులో 62 ఎకరాలు, జుల్లేకల్ లో 49.5 ఎకరాలు, నల్లగొండ జిల్లాలోని డిండిలో 176.02 ఎకరాలు, చెరుకుపల్లిలో 54.3 ఎకరాలు, నిర్మల్ జిల్లా కడెంలో 29.13 ఎకరాలు కేటాయించారు. 1629 ఎకరాల్లో 981 ఎకరాలు నికరసాగు విస్తీర్ణం ఉన్నట్లు అధికార లెక్కలు పేర్కొంటున్నాయి. అయితే అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ కొరవడింది. దీంతో సీడ్ ఫాం భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో ఫాం భూములు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.

85 ఎకరాలు కబ్జా..

Advertisement

అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఆక్రమణకు గురవుతున్నాయి. కామరెడ్డి జిల్లాలోని మాల్తుమేడలో 60 ఎకరాలను 42 మంది రైతులు ఆక్రమించారు. 7 నుంచి 8 మంది రైతులు భూభారతిలోని నమోదు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది రైతులు జన్మభూమి కింద భూములు ఇచ్చారని సాగుచేసుకుంటుండటం గమనార్హం. ఆ భూమికి పెన్షింగ్ వేయకపోవడంతోనే ఆక్రమణకు గురైనట్లు వెల్లడైంది. మరో విషయం ఏమిటంటే కరెంటు బిల్లుల కోసం 44 లక్షలు కమిషనరేట్ రిలీజ్ చేసినట్లు స్పష్టమైంది. బొప్పాసపల్లిలో 14 మంది రైతులు 25 ఎకరాలు ఆక్రమించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ భూమికి సంబంధించిన ట్రాన్స్ ఫర్ కు సంబంధించిన పత్రాలుగానీ లేవు. కానీ కొందరు ఆక్రమించి భూములను సాగుచేస్తున్నారు. ఈభూములపై సబ్ కలెక్టర్ విచారణ చేస్తున్నట్లు సమాచారం. సీడ్ ఫాం దగ్గర సైతం ఎలాంటి డాక్యూమెంట్లు లేవు. ఓన్లీ పహానీ మాత్రమే ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు సమాచారం. భూమి ఆక్రమణకు గురికాకుండా ఏఈ, పీఆర్ అధికారులు పెన్షింగ్ కోసం అంచనాలు రూపొందించినట్లు సమాచారం. అదే విధంగా అయితే ఫాం కు చెందిన 50 ఎకరాల భూమిని వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించారు. మరో 135 ఎకరాలు ప్రైవేట్ కంపెనీకి చెందిన బయో గ్యాస్ ప్లాంట్లకు ఇచ్చారు. అందులో బాప్పాసపల్లిలో 60 ఎకరాలు,మల్తుమెడలో 60 ఎకరాలు, సదాశివపేటలో 15 ఎకరాలు ఉన్నాయి.

Also Read: Seethakka: మిషన్ భగీరథతో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలి.. మంత్రి సీతక్క దిశానిర్దేశం

రైతు కమిషన్ సీరియస్..

Advertisement

వ్యవసాయ విత్తనోత్పత్తికి కేటాయించిన భూములు ఆక్రమణకు గురి అవుతుండటంపై రైతు కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్రంలో ఎన్ని భూములు ఉన్నాయనేదానిపై వివరాలు సేకరించింది. 85 ఎకరాలు కబ్జాకు గురికావడంపై అధికారులపై సీరియస్ అయింది. సమీక్ష సమావేశంలో ఈ భూముల కబ్జా వెలుగులోకి వచ్చింది. అయితే 8 సీడ్ ఫాంలకు సంబంధించిన భూములకు పెన్షింగ్ వేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

ప్రభుత్వానికి నివేదిక?

ఒకటిరెండ్రోజుల్లో సీడ్ ఫాం భూముల ఆక్రమణకు సంబంధించిన వివరాలు, చేపట్టాల్సిన అంశాలపై సూచనలతో కూడిన నివేదికను రైతు కమిషన్ అందజేయబోతున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని సైతం కలిసి ఆక్రమణపై వివరించనున్నట్లు సమాచారం. సీడ్ పాం భూములను కాపాడితేనే నాణ్యమైన విత్తాలను రైతులకు అందించవచ్చని రైతు కమిషన్ పేర్కొంటుంది. లేకుంటే ప్రైవేటు కంపెనీలను ఆశ్రయించి నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రతి ఏటా రైతులకు ఈ ఫాం నుంచి పాడి సీడ్ ను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఏది ఏమైనా రైతు కమిషన్ మాత్రం సీడ్ ఫాం భూములను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుంది.

Also Read: Palakonda Constituency: రసవత్తరంగా మారుతున్న పాలకొండ పాలిటిక్స్.. కూటమి నేతల కుమ్ములాటలకు బలైతున్న ప్రజలు..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×