E-Paper
Advertisement

Vijay – Rashmika: “విరోష్” జంటకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్!

Vijay – Rashmika: “విరోష్” జంటకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్!
Advertisement

Vijay – Rashmika: ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ వేదికగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda ), రష్మిక మందన్న(Rashmika mandanna) జంటకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఒక నోట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విరోష్ జంటకు ప్రధాని నరేంద్ర మోదీ స్పెషల్ విషెస్..

సామాజిక మాధ్యమాల వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. “శ్రీమతి మాధవి, శ్రీ గోవర్ధన్ రావు దేవరకొండ గారు ఫిబ్రవరి 26 2026న జరగనున్న విజయ్- రష్మికల వివాహానికి మీరు నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది. నిజంగా ఈ సంతోషకరమైన, శుభప్రదమైన సందర్భంగా దేవరకొండ – మందన్న కుటుంబాలకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఈ జంట నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. సినీ రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు కళాకారులు.. వ్యక్తిగత జీవితంలో కూడా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ఆయన విరోష్ జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఉదయపూర్ చేరుకున్న పురోహితులు..

Advertisement

ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ లోని ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే హిందూ సాంప్రదాయ పద్ధతిలో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న ఉదయం జరగనుండగా.. కర్ణాటక పద్ధతిలో కొడువ సంప్రదాయంగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహం సాయంత్రం జరగనుంది. ఇలా రెండు పద్ధతుల్లో రేపు వీరు వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు పురోహితులు ఉదయపూర్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎయిర్పోర్ట్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

8 ఏళ్ల ప్రేమాయణం తర్వాత ఒక్కటవుతున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న..

గీత గోవిందం సినిమా సమయంలో మొదలైన వీరిద్దరి మధ్య పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత వీరిద్దరూ తమ బంధాన్ని అఫీషియల్ గా ప్రకటించి ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. మొత్తానికైతే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు, నెటిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో మరోసారి సందడి చేయనున్న విరోష్..

Advertisement

ఇప్పటికే గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ జంట.. ఇప్పుడు రణబాలి అనే మరో చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతోంది.ఏది ఏమైనా ఈ జంట ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవాలని అభిమానులు ఎదురుచూస్తూ ఉండడం గమనార్హం.

also read:Tollywood: పెళ్లి పీటలెక్కుతున్న విజయ్ -రష్మిక.. తెరపైకి మరో కొత్త రూమర్డ్ జంట!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×