// //
Telangana Rising Global Summit: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు వేడుకలు.. ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అత్యాధునిక సాంకేతికతను కేంద్రబిందువుగా చేసుకుని నిర్వహించిన మెగా డ్రోన్ షో తెలంగాణకు గిన్నీస్ వరల్డ్ రికార్డును తెచ్చిపెట్టింది. మొత్తం 3,000 డ్రోన్లు ఆకాశాన్ని అలంకరించడంతో, ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎవ్వరూ సాధించని విజయం తెలంగాణ సాధించింది.
ఈ భారీ డ్రోన్ లైట్ షోను ప్రత్యేకంగా తెలంగాణ రైజింగ్–2047 విజన్ ఆధారంగా రూపొందించారు. మొత్తం ప్రదర్శనలో ఒక దశ నుంచి మరో దశకు మారే విధంగా డ్రోన్లకు AI ఆధారిత ఆటో-సింక్ టెక్నాలజీని ప్రయోగించారు. అంతర్జాతీయ ప్రమాణాలలో నిర్వహించిన ఈ షో కేవలం టెక్నాలజీ ప్రదర్శన మాత్రమే కాకుండా, ప్రపంచానికి తెలంగాణ సామర్థ్యాలను చాటిచెప్పే ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.
ఇంతకుముందు గిన్నీస్ వరల్డ్ రికార్డు అబుదాబి పేరిట నమోదైంది. అక్కడ 2,131 డ్రోన్లు వినియోగించారు. ఆ రికార్డును అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం, టెక్ పార్క్త్‌నర్ కంపెనీలు, స్టార్ట్‌అప్స్ కలిసి క్రమపద్ధతిలో పనిచేశాయి.
ప్రదర్శన పూర్తయ్యాక గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి హాజరైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అధికారుల బృందం Telangana Drone Show ను రికార్డు బ్రేకింగ్ ఈవెంట్ గా అంగీకరించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారిక ధ్రువపత్రాన్ని అందజేసింది.
డ్రోన్ షో తర్వాత ఆకాశాన్ని ప్రకాశింపచేసిన గ్రాండ్ ఫైర్వర్క్స్ ప్రజలను ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ ప్రతినిధులు, టెక్ దిగ్గజాల ప్రతినిధులు, విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొని ఈ అద్భుత క్షణాలను కెమెరాల్లో బంధించారు.
ఈ డ్రోన్ షో విజయం కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు. Telangana Rising Global Summit లక్ష్యం.
Also Read: తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల.. మామూలుగా లేదుగా.. కళ్లు చెదిరిపోయేలా డెవలప్‌మెంట్
దేశం మొత్తం నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ డ్రోన్ షోను “భారతదేశంలో ఇప్పటివరకు చూడని అద్భుతం”గా అభివర్ణించారు.