E-Paper
Advertisement

CM Revanth Reddy: నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకూ తెలంగాణ రైజింగ్ కు తిరుగులేదు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకూ తెలంగాణ రైజింగ్ కు తిరుగులేదు: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.

‘జాతి కోసం, జనహితం కోసం, గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి. గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంకల్పం కావాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం తనకు ఆ ధైర్యం ఇచ్చి.. తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి, నిండు మనస్సుతో ఆశీర్వదించిన తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండేళ్ల ప్రస్థానంలో అనునిత్యం అహర్నిశలూ ప్రపంచంలో తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించానన్నాకు.

ఆడబిడ్డలకు ఆర్థిక మద్దతు

Advertisement

‘గత పాలన శిథిలాల కింద కొనఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశాం. రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపాం. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతు ఇచ్చి అదానీ, అంబానీల లెక్క వ్యాపారరంగంలో నిలిపాం. బలహీనవర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పాం. వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశాం. చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని నమ్మి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశాం. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టాం. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్ధాంతంగా ముందుకు సాగుతున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సంక్షేమ సాక్ష్యాలు

“జయ జయహే తెలంగాణ” అన్న ప్రజాకవి అందెశ్రీ గేయానికి, జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500 కే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయన్నారు. నేటి అవసరాలు తీర్చి, పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతం అని సరిపెట్ట లేదన్నారు. స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి తెలంగాణ ఎట్లుండాలి, ఎక్కడ ఉండాలో లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామన్నారు.

దేశానికి తెలంగాణ గ్రోత్ ఇంజిన్

Advertisement

“గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్ కు మేం ప్రాణం పోశాం. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీ సౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. భారత దేశ గ్రోత్ ఇంజిన్ గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశాం. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క. నిన్న, నేడు, రేపు మీ ఆశీర్వాదమే నా ఆయుధం. మీ ప్రేమాభిమానాలే నాకు సర్వం, మీ సహకారమే నాకు సమస్తం. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు, ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగులేదు” అని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ రెండేళ్ల పాలన శుభాకాంక్షలు తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×