E-Paper
Advertisement

Global Summit 2025: గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై.. సీఎం రేవంత్ సమీక్ష

Global Summit 2025: గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై.. సీఎం రేవంత్ సమీక్ష
Advertisement

Global Summit 2025: డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లను.. వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్చలు, సమీక్ష సమావేశాలను ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నేటి నుంచి నవంబర్ 30 వరకు.. ప్రతిరోజూ విభాగాల వారీగా సమీక్షలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరుగనున్నాయి. ఈ సమ్మిట్‌ను అంతర్జాతీయ పెట్టుబడిదారులు, గ్లోబల్ ఇండస్ట్రీ నాయకులు, పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఈ సమీక్షల్లో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సహా సంబంధిత మంత్రులు పాల్గొంటారు. సమ్మిట్‌లో విడుదల చేయనున్న ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌కు తుది రూపం ఇవ్వడంపైనా.. ఈ సమావేశాల్లో దృష్టి పెట్టనున్నారు.

Advertisement

సమ్మిట్ లాజిస్టిక్స్, ప్రోగ్రాం స్ట్రక్చర్, గ్లోబల్ డెలిగేషన్ల రాకపోకలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. వేదిక డిజైన్, భద్రత, పాల్గొనే దేశాల లిస్ట్, డెలిగేషన్ మ్యాపింగ్ వంటి అంశాలను ఈరోజు సమీక్షిస్తారు.

రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో.. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క హాజరవుతారు.

Advertisement

నవంబర్ 27 – మౌలిక వసతులు, అభివృద్ధి

ఈరోజు జరగనున్న సమావేశానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకానున్నారు.

నవంబర్ 28 – విద్య, యువజన సంక్షేమం

సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి మంత్రులు వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి పాల్గొంటారు.

సాయంత్రం 6 గంటలకు – టూరిజం, దేవాలయ పర్యాటకం

మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ పాల్గొంటారు. తెలంగాణ టూరిజం బ్రాండింగ్, పుణ్యక్షేత్ర పర్యాటనం, అంతర్జాతీయ ప్రమోషన్ క్యాంపెయిన్లుపై ప్రణాళికలు సిద్ధం చేస్తారు.

నవంబర్ 29 – వ్యవసాయం, సంక్షేమ విభాగాలు
సాయంత్రం 4 గంటలకు సమావేశం

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకాటి శ్రీహరి పాల్గొంటారు.

సాయంత్రం 6 గంటలకు

మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్ పాల్గొంటారు.

నవంబర్ 30 – ఆరోగ్య రంగం

సీఎంతో పాటు మంత్రి దామోదర్‌ రాజనరసింహ సంబంధిత అధికారులు ఈ సమావేశంలో  పాల్గొననున్నారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×