E-Paper
Advertisement

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Advertisement

Telangana Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలకు విరామం లభించనుంది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షంతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 3 శుక్రవారం నుండి ఏప్రిల్ 5 ఆదివారం వరకు వివిధ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం (ఏప్రిల్ 3)న‌ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి మరియు మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. శనివారం (ఏప్రిల్ 4)న‌ వర్షాల ప్రభావం మరింత పెరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల మరియు జనగామ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఆదివారం (ఏప్రిల్ 5) ఆదివారం నాటికి వర్షాల విస్తృతి మరింత పెరగనుంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని ప్రజలను హెచ్చరించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉన్నందున ఐకేపీ (IKP) కేంద్రాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకపోవడం ఉత్తమమని నిపుణులు తెలుపుతున్నారు.

Read Also: వేసవిలో పిల్లల ఇమ్యూనిటీ కోసం ఈ ఆహారాలు తప్పనిసరి.. మీ పిల్లల డైట్‌లో ఉన్నాయా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×