E-Paper
Advertisement

రేపే పాలిసెట్ ఎక్సామ్.. పరీక్షకు ముందు ఇవి గుర్తున్నాయా..?

రేపే పాలిసెట్ ఎక్సామ్.. పరీక్షకు ముందు ఇవి గుర్తున్నాయా..?
Advertisement

POLYCET Exam: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఈనెల 13వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 3 ఏళ్ల ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష ప్రాతిపదికగా ఉంటుంది.

మొత్తం 293 కేంద్రాలలో..

పరీక్షకు మొత్తం 1,06,439 దరఖాస్తు చేసుకున్నారు. కాగా అందులో పురుషులు 56,494 మంది ఉండగా.. మహిళలు 49,945 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 293 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 10 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించనున్నారు. ఉదయం 11 గంటల తర్వాత వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరని అధికారులు స్పష్టంచేశారు.

Advertisement

Also read: ఇండస్ట్రీలో విషాదం.. వన్ లైఫ్ టు లివ్ నటి మృతి.. అసలేం జరిగిందంటే?

ఎస్ బీటెట్ టీజీ’ మొబైల్ యాప్‌..

అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాన్ని సులభంగా చేరుకోవడానికి ‘ఎస్ బీటెట్ టీజీ’ మొబైల్ యాప్‌ను వినియోగించుకోవచ్చని సూచించారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులో హాల్ టికెట్ నంబర్ నమోదు చేయడం ద్వారా పరీక్షా కేంద్రం చిరునామా, గూగుల్ మ్యాప్స్ ద్వారా అక్కడికి చేరుకునే మార్గాన్ని సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Advertisement

Also read: బండికి బీజేపీలో నేత‌లంతా శ‌త్రువులే..! కార్య‌క‌ర్త‌లే కొండంత అండ‌..! అమిత్ షా ఏం చేయ‌బోతున్నారు??

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×