E-Paper
Advertisement

వెనక్కి తగ్గని బేర్..మరోసారి వణికిన దలాల్ స్ట్రీట్, దాదాపు 16 లక్షల కోట్ల సంపద ఆవిరి

వెనక్కి తగ్గని బేర్..మరోసారి వణికిన దలాల్ స్ట్రీట్, దాదాపు 16 లక్షల కోట్ల సంపద ఆవిరి
Advertisement

Stock Market: మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య మంగళవారం స్టాక్ మార్కెట్‌లో బేర్ వీర విహారం చేసింది.  ఆది నుంచి బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ ఏమాత్రం కోలుకోలేకపోయాయి.  బీఎస్ఈ సెన్సెక్స్ 1500 పాయింట్లు, నిఫ్టీ 450 పాయింట్లు నష్టపోయింది. వరుసగా నాలుగో సెషన్‌లో మార్కెట్ పతనం కావడంతో మదుపరుల సంపద ఏకంగా 16 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి.

బేర్ వీర విహారంతో వణికిన దలాల్ స్ట్రీట్

Advertisement

దేశీయ బాంబే స్టాక్‌ మార్కెట్‌ మదుపరులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మంగళవారం ఉదయం నుంచి మార్కెట్ ప్రారంభమైన నుంచి విదేశీ మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు భారీగా పతనమయ్యాయి. తొలుత 399 పాయింట్లు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 96 పాయింట్లు నష్టపోయింది.

ఇదే క్రమంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. మూడు సెషన్‌లో మార్కెట్ ఏ మాత్రం కోలుకోలేదు. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1280 పాయింట్లు, నిఫ్టీ 386 పాయింట్లు పైగానే పతనమయ్యాయి.  నిఫ్టీ బ్యాంక్-1.5 శాతం, అన్నింటికి కంటే నిఫ్టీ ఐటీ-3.7 శాతం, నిఫ్టీ ఫార్మా-1.4 శాతం, నిఫ్టీ ఆటో-2.3 శాతం, ఎఫ్ఎంసీజీ-1.5, నిఫ్టీ నెక్ట్స్ 50-2.4 శాతం, నిఫ్టీ ఫైనాన్స్ సర్వీసు 1.9 శాతం నష్టపోయాయి.

Advertisement

బీఎస్ఈ సెన్సెక్స్  1280, నిఫ్టీ 386 పాయింట్లు పతనం

ఐటీ స్టాక్స్‌ అమ్మకాలతో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 2023 మే తర్వాత ఈ స్థాయికి ఐటీ పడిపోవడం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన ఏఐ సంస్థ ఓపెన్‌ ఏఐ కొత్త కంపెనీని ప్రకటించడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈ వరుసగా నాలుగు సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 4 శాతం, నిఫ్టీ 3.7 శాతం నష్టపోయినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

శామ్‌ ఆల్ట్‌మన్‌ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ సంస్థ కొత్తగా ఓపెన్ ఏఐ డిప్లాయ్‌మెంట్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసింది. అందుకోసం దాదాపు 4 బిలియన్‌ డాలర్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. దీంతో సంప్రదాయ ఐటీ సర్వీస్‌ కంపెనీల వ్యాపారానికి ముప్పుగా మారుతుందనే ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఫలితంగా ఐటీ షేర్లను మదుపరులు అమ్మకాలకు దిగారని నిపుణులు చెబుతున్నారు.

ALSO READ: నిద్రలేవగానే ఒళ్లు నొప్పులా ? మీరు చేస్తున్న ఈ 5 తప్పులే కారణం!

మే ఆరు బుధవారం నాటికి రూ. 473 లక్షల కోట్ల నుండి మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 457 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు సుమారు రూ. 16 లక్షల కోట్లు నష్టపోయారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×