E-Paper
Advertisement

తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. ఖర్చు తక్కువ మజా ఎక్కువ!

తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. ఖర్చు తక్కువ మజా ఎక్కువ!
Advertisement

Electric Boats: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో పర్యాటక రంగంలో సరికొత్త విప్లవానికి టూరిజం శాఖ కసరత్తు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జలాశయాల్లో ఎలక్ట్రిక్ బోట్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పొల్యూషన్ ప్రీ వైపు అడుగులు వేస్తుంది. కేబినెట్ ఆమోదం తర్వాత అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. తొలుత హుస్సేన్ సాగర్ లో ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. ఇది సక్సెస్ అయితే రాష్ట్రంలోని బూటింగ్ ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎక్కువ ట్రిప్పులు..

రాష్ట్రంలోని 19 జిల్లాల్లో నదులు, సరస్సుల్లో 99 బోట్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. వీటికి పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీంతో బోట్లను ఎక్కువ ట్రిప్పులు నడుతుపున్నారు. అయితే పర్యాటక ప్రాంతాల్లో డీజిల్ బోట్ల వల్ల వెలువడుతున్న కాలుష్యం, శబ్ద జోక్యానికి చెక్ పెట్టేందుకు పర్యాటకశాఖ పూర్తిగా పొల్యూషన్ ప్రీ విధానం వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బోట్ల నిర్వహణకు రూపకల్పన జరుగుతోందని సమాచారం. దీంతో డీజిల్ ఖర్చు కూడా తగ్గుతుందని, రెవెన్యూ పెరుగుతుందని, పొల్యూషన్ ఉండదని అధికారులు భావిస్తున్నారు. అంతేగాకుండా పొల్యూషన్ పెరిగితే భావితరాలకు కలిగే నష్టాలను సైతం పర్యాటకులకు వివరించాలని అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: ముగ్గురినే ఉతికి ఆరేశాం.. మిగిలిన 21 మంది వైసీపీ నాయకులను వదిలేదే లేదు!- జేసీ ప్రభాకర్ రెడ్డి

ఒక్కో బోటుకు రూ.34 లక్షల అంచనా..

ఎలక్ట్రికల్ బోట్లకు సంబంధించి టూరిజం శాఖ అంచనా వ్యయం సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక్కో ఎలక్ట్రిక్ బోటు కొనుగోలుకు సుమారు రూ.34 లక్షల వరకు ఖర్చు కానున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ బోట్లకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలో జరుగబోయే కేబినెట్ లో ఇందుకు సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఎలక్ట్రిక్ బోట్లు అందుబాటులోకి వస్తాయి.

ఈవీ కంపెనీలతో సంప్రదింపులు?

Advertisement

ప్రయాణికులకు సురక్షితమైన, అత్యుత్తమ సాంకేతికత కలిగిన బోట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే పలు ఈవీ ప్రముఖ తయారీ కంపెనీలతో అధికారులు సంప్రదింపులు జరినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఈవీ బోట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు, ద్విచక్రవాహనాలు, కార్లతో పాటు కొన్ని ట్రాన్స్ పోర్టు వాహనాలు సైతం అందుబాటులోకి వచ్చాయి.

హుస్సేన్ సాగర్ లోనే ప్రయోగం

ప్రయోగాత్మకంగా తొలి విడుతలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన జలశయాల్లో మొత్తం 5 ఎలక్ట్రిక్ బోట్లను ప్రవేశపెట్టాలని టూరిజం శాఖ భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే భవిష్యత్తులో మరిన్ని పర్యాటక ప్రాంతాలకు వీటిని విస్తరించాలని స్పష్టమైన ప్రణాళిక రూపొందించారు. అయితే రాష్ట్రంలోనే ఎక్కువగా పర్యటకులు వచ్చే హుస్సేన్ సాగర్ లోనే ఎలక్ట్రిక్ బోట్లను తిప్పబోతున్నట్లు సమాచారం. పెడల్ బోటు, స్పీడ్ బోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టుబోతున్నట్లు సమాచారం.

Also Read: డిజిటల్ సేవల్లో తెలంగాణ నయా రికార్డు.. దేశంలోనే నెంబర్ వన్ స్థానం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×