E-Paper
Advertisement

Telangana Panchayat Elections Polling-2025: తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. పలుచోట్ల ఘర్షణలు, కేంద్రాల వద్ద ఓటర్లు

Telangana Panchayat Elections Polling-2025: తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. పలుచోట్ల ఘర్షణలు, కేంద్రాల వద్ద ఓటర్లు
Advertisement

Telangana Panchayat Elections Polling-2025: తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పోలింగ్ కొనసాగనుంది.

తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

Advertisement

Advertisement

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో నిర్వహించడంతో అప్పుడే పోలింగ్ మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు అప్పుడే తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.

అధికారులు భోజనాల తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు తర్వాత వార్డు సభ్యులతో పార్టీల మద్దతుదారులు సమావేశాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచి ఎన్నిక జరగనుంది. పార్టీ రహిత ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలోకి నిలపడంతో ఆసక్తికరంగా మారింది.

ఓటు హక్కు వినియోగించుకున్న నేతలు, కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ

తొలివిడతలో 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకోసం 37,562 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 56,19,430 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.  గ్రామాల్లో ఓట్ల సందడి కావడంతో భారీగా పోలీసులు మొహరించారు.

తొలి దశలో 4,236 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు.. 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. ఐదు సర్పంచ్, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. దాదాపు 396 సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. దాదాపు 9,633 వార్డు ఏకగ్రీవమైన వాటిలో ఉన్నాయి.

ALSO READ:  ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. రాత్రి రాహుల్-ప్రియాంకగాంధీలతో భేటీ

ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. వాటిలో 3,461 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ జరిగే గ్రామాల్లో మద్యం దుకాణాలను మూసి వేశారు. స్థానికంగా సెలవు ప్రకటించారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×