E-Paper
Advertisement

OTT Movie : మొగుడి మర్డర్ కేసులో అదిరిపోయే ట్విస్టులు… డిటెక్టివ్ తో దోబూచులాటలు

OTT Movie : మొగుడి మర్డర్ కేసులో అదిరిపోయే ట్విస్టులు… డిటెక్టివ్ తో దోబూచులాటలు
Advertisement

OTT Movie : ఓటీటీలో ఓ కొరియన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఆసక్తికరమైన కథనంతో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నిద్రలేని సమస్య ఉన్న ఒక పోలీసు డిటెక్టివ్ చుట్టూ తిరుగుతుంది. ఒక హత్య కేసు విచారణలో అనుమానితురాలిపై డిటెక్టివ్ ప్రేమలో పడతాడు. చివరికి వాళ్ళ స్టోరీ ఏమైందనేదే ఈ కథ. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, చివరి వరకు చూపు తిప్పుకోకుండా చేస్తుంది. రొమాంటిక్ థ్రిల్లర్ స్టోరీలను ఇష్టపడే వాళ్ళు మిస్ చేయకూడాని సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2022లో విడుదలైన ఈ కొరియన్ రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘డెసిషన్ టు లీవ్’ (Decision to Leave). ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు పార్క్ చాన్-వూక్ దర్శకత్వం వహించారు. ఆయనకు 2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు కూడా లభించింది. ఈ దర్శకుడు గతంలో ‘Oldboy’, ‘The Handmaiden’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. ఇందులో పార్క్ హే-ఇల్, టాంగ్ వీ లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ MUBI, Amazon Prime Video, Apple TVలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : అమ్మాయిల బట్టలను దొంగలించి పాడు పని… వదినతో యవ్వారం… మామూలు ఆటగాడు కాదు

స్టోరీ ఏమిటంటే

హే-జూన్ అనే పోలీసు డిటెక్టివ్ వృత్తిలో చాలా నిబద్ధతతో ఉంటాడు. కానీ అతను చాలా రోజుల నుంచి నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు అతని దగ్గరకి విచిత్రమైన కేసు వస్తుంది. దీంతో అతని లైఫ్ గందరగోళంలో పడుతుంది. ఒక పర్వతం పైనుండి పడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపించే కేసును అతను దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. మృతుడి భార్య, సాంగ్ చైనాకు చెందిన ఒక వలస మహిళ. సో-రే ప్రవర్తన పోలీసులకు అనుమానాస్పదంగా ఉంటుంది. తన భర్త చనిపోయినప్పటికీ, ఆమెలో ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆమె భర్తను చంపింది ఆమెనే అని డిటెక్టివ్ హే-జూన్ అనుమానిస్తాడు. కేసు దర్యాప్తులో భాగంగా, డిటెక్టివ్ హే-జూన్ ఆమెను ఫాలో అవుతూ ప్రతి ఒక్క విషయాన్ని గమనించడం మొదలెడతాడు.

Advertisement

ఈ సమయంలో ఆమె అందం, తెలివితేటలు చూసి, హే-జూన్ మంత్రముగ్ధుడవుతాడు. సో-రే కూడా హే-జూన్ పట్ల ఆసక్తిని కనబరుస్తుంది. వారి మధ్య ఒక రొమాంటిక్ స్పార్క్ మొదలవుతుంది. అతను ఆమెను ప్రేమించడం మొదలుపెట్టి, ఆమె నేరస్తురాలు కాకుండా ఉండాలని బలంగా కోరుకుంటాడు. హే-జూన్ ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడు, కానీ అదే సమయంలో ఆమె నిజంగా హంతకురాలా కాదా అనే సందేహం అతనిని వెంటాడుతూ ఉంటుంది. క్లైమాక్స్ లో కథకి ఒక ఆసక్తికరమైన ముగింపు వస్తుంది. ఆ ముగింపు ఏమిటి ? సాంగ్ భర్త ఎలా చనిపోయాడు ? తనే చంపిందా ? ఈ లవ్ స్టోరీ ఏమవుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×