E-Paper
Advertisement

TG Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎగ్జిట్ పోల్స్.. మళ్లీ ఊపులో హస్తం.. బీఆర్ఎస్, బీజేపీ పరిస్థితి ఏంటి?

TG Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎగ్జిట్ పోల్స్.. మళ్లీ ఊపులో హస్తం.. బీఆర్ఎస్, బీజేపీ పరిస్థితి ఏంటి?
Advertisement

TG Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ‘పీపుల్స్ పల్స్’ (Peoples Pulse) సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 123 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 68-76 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉండగా, బీఆర్ఎస్ పార్టీ 29-36 మున్సిపాలిటీలతో రెండో స్థానానికి పరిమితం కానుంది. బీజేపీ కేవలం 3-5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది.

ఓట్ల శాతం పరంగా కాంగ్రెస్ పార్టీ 36 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉండ‌గా.. బీఆర్ఎస్ 29.7 శాతం, బీజేపీ 19.3 శాతం ఓట్లను సాధించే సూచనలు ఉన్నాయి. వార్డుల వారీగా చూస్తే, మొత్తం 2582 వార్డులలో కాంగ్రెస్ 1210-1290 స్థానాల్లో, బీఆర్ఎస్ 860-930 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. సామాజిక వర్గాల వారీగా విశ్లేషిస్తే.. ఎస్సీ (41.2 శాతం), ముస్లిం (44.7 శాతం), ఓబీసీ (33.6 శాతం) ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగా, ఎస్టీ వర్గం మాత్రం బీఆర్ఎస్ (36.9 శాతం) పట్ల సానుకూలంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.

Advertisement

జిల్లాల వారీగా.. నల్గొండ (14-16), మహబూబ్ నగర్ (13-15) జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా ఉండగా, మెదక్ (9-11), వరంగల్ (7-9) జిల్లాల్లో బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకుంటోంది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 5-7 స్థానాలు గెలిచే అవకాశం ఉండగా, ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు ఫిబ్రవరి 13న వెలువడనున్నాయి.

Read Also: Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. తిరుగులేని విజయం సాధిస్తున్నాం, మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×