// // Komatireddy Venkat Reddy: నల్లగొండను అభివృద్ధి చేసి ప్రజల -->
E-Paper
Advertisement

Komatireddy Venkat Reddy: నల్లగొండను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy: నల్లగొండను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Advertisement

Komatireddy Venkat Reddy:  కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని 33వ డివిజన్ మీర్ బాగ్ కాలనీ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, పేదల సంక్షేమం గురించి పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎంజి యూనివర్సిటీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన భవనాలకు 200 కోట్లు కేటాయించడంతో పాటు, ఇటీవల నూతనంగా ఫార్మసీ కోర్సులను మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని స్పష్టం చేశారు.

పేదలకు అండగా ఉంటా

అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. పేదలకు ఏ సమస్య వచ్చినా వారికి ఎల్లవేళలా అండగా ఉంటారని, నేను బతికున్నంత కాలం పేద ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్నారు.మేయర్ ఎన్నిక పూర్తి అయిన తర్వాత ప్రతి డివిజన్లో ప్రజా దర్బారు నిర్వహించి కార్పొరేటర్ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో 100 ఎకరాల భూమిని సేకరించి దేవరకొండ రోడ్ లో 4000, నార్కట్పల్లి రోడ్ లో 4,000 ఇందిరమ్మ ఇండ్లను 75 గజాలలో కట్టించి పేదలకు అందజేస్తామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పేదోళ్లకు సంబంధించిన ఎన్నికలని తెలిపారు.

Advertisement

Also Read: Telangana Municipal Election-2026: మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటాం 

ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే అన్ని డివిజన్లో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలిస్తే ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవన్నారు . త్వరలోనే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించిన నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలను మోడల్ కాలేజీ గా మారుస్తామని తెలిపారు.

మోడల్ గ్రంథాలయంగా అభివృద్ధి చేస్తాం 

Advertisement

మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో 600 కోట్ల పనులకు సంబంధించి టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కాలనీలో ఉన్న ప్రతి పార్కును అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. జిల్లా గ్రంథాలయాన్ని మోడల్ గ్రంథాలయంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రూ. 10 కోట్లతో అధునాతన షాదీ ఖానా నిర్మిస్తామని అన్నారు. పట్టణ ప్రజలకు 24 గంటలు తాగునీరు వచ్చే విధంగా 12 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని తెలిపారు. దీంతో త్వరలో అన్ని కాలనీలకు 24 గంటల తాగనీరు అందుతుందని అన్నారు.

కార్పోరేషన్ లలో కాంగ్రెస్ పార్టీదే విజయం

రాష్ట్రంలో జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో విజయం సాధిస్తామని ఈ సందర్భంగా మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో అన్నింటిలో గెలుపొందుతామని, 116 మున్సిపాలిటీలలో 110 స్థానాలలో విజయం సాధిస్తామని తెలిపారు. ఐదేళ్ల మన భవిష్యత్తు నిర్ణయించేది ఓటేనని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.అర్బన్ ప్రాంతాలలో ఓటింగ్ శాతం తగ్గుతుందని, 90 శాతం పోలింగ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు ఓటు వేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Addanki Dayakar: సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లతో భాగ్యనగర దశ తిరగబోతోంది: ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×