E-Paper
Advertisement

Telangana Govt: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పంటలపై బ్యాంకు రుణాలు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Govt: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పంటలపై బ్యాంకు రుణాలు పెంచుతూ ప్రభుత్వం  కీలక నిర్ణయం
Advertisement

Telangana Govt:  ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నకు పంటల సాగులో పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న జిల్లా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి సాగు రుణాల పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.2026-2027ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనల వల్ల జిల్లాలోని 1.69 లక్షల మంది రైతులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల ద్వారానే రైతులకు మరిన్ని నిధులు అందేలా రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపింది. కేవలం పంటలకే కాకుండా భారీ పరిశ్రమలు, గొర్రెలు, మేకల పెంపకం అంటే అనుబంధ రంగాలకు కూడా రుణ పరిమితిని పెంచింది. ఈ నిర్ణయంతో జిల్లాలో దాదాపు 3.69 లక్షల ఎకరాలు సాగుతున్న వివిధ పంటలకు ఆర్థిక భరోసా లభించనుంది.

రైతులకు లాభం

పాడిపంటల రుణాల పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్ల కమిటీ, కో ఆపరేటివ్ ఎఫెక్ట్స్ బ్యాంకు ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ పంటల రుణాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది 44 రకాల సాగు పంటలకు 84 రకాల ఉద్యానవన పంటలకు మత్స్య పౌల్ట్రీ డైరీ రంగాలకు సైతం రుణాల పరిమితిని పెంచడం వల్ల రైతులకు లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. 2026 – 27వ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పంట రుణాల పరిమితి పెరగనుంది. పంట రుణాలు ఇవ్వని కొన్ని పంటలకు సైతం రాబోయే ఆర్థిక సంవత్సరంలో రుణాలు ఇచ్చేందుకు రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 2.93 లక్షల ఎకరాలకు పైగా సాగుకు యోగ్యమయ్యే భూములు ఉండగా తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లక్షలాది మంది రైతులకు లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వరి పంట, పత్తి, మిర్చి, గొర్రెలు, మేకలు, కోళ్ల పరిశ్రమలకు సంబంధించిన వాటికి రుణ పరిమితి పెరిగింది. జిల్లాలో అత్యధికంగా వరి పంటను సాగు చేసే రైతులు ఉండడంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో మెజార్టీ రైతులకు లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Also Read: Koragajja: మరో ‘కాంతార’ తరహా చిత్రం.. ఇందులోని హైలెట్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు

2 వేల చొప్పున పెంపు

ఇప్పటివరకు వరి పంటకు ఎకరాకు రూ 46 వేలు పత్తికి రూ. 48 వేలు మిర్చికి రు 86 వేలు ఇచ్చేవారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పంటల వారీగా రుణపరిమితి పెంచడంతో వరి పంటకు ఎకరాకు రూ 48 వేలు, పత్తికి 50 వేలు, మిర్చికి 90 వేల చొప్పున ఇవ్వనున్నారు. మొక్కజొన్నకు ఇదివరకు 36 వేలు ఉండగా దానిని 38 వేలకు పెంచారు. వేరుశనగకు రూ 32 వేలు ఉండగా 34 వేలకు పెంచారు. గొర్రెలు,మేకల యూనిట్లకు సైతం రుణ పరిమితిని పెంచారు. గొర్రెలు మేకలు, బాయిలర్ కోళ్లపైన రుణ పరిమితి పెరిగింది. ప్రస్తుతం గొర్రెల 28 వేలు ఇస్తుండగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో దానిని 32 వేలకు పెంచారు. మేకల యూనిట్ కు ప్రస్తుతం 29 వేలు ఇస్తుండగా దానిని 35 వేలకు పెంచారు. బాయిలర్,లేయర్ కోళ్లపైనా పరిమితి పెరిగింది .

వరి రైతులకు అధికమేలు

Advertisement

జిల్లాలో పంటలకు సంబంధించిన పెట్టుబడి రోజురోజుకు పెరుగుతున్నడంతో బ్యాంకుల ద్వారా ఇస్తున్నారు. రైతులకు సరిపోవడం లేదు. దీంతో రైతులు ప్రవేట్ వ్యక్తులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి రుణపరిమితి పెంచడంతో కొంత రైతులకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వరి, పత్తి, మిర్చి పంట వేసే రైతులకు గతంలో ఉన్న పరిమితి కంటే రెండు వేల నుంచి ఐదువేల వరకు పెంచడంతో జిల్లాలోని రైతాంగానికి మేలు జరగనుంది.

Also Read: Fake Seeds: సత్తుపల్లిలో నకిలీ విత్తనాల కలకలం.. వెంకటరమణ సీడ్స్ షాప్ ముందు రైతుల ఆందోళన

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×