E-Paper
Advertisement

Telangana floods: వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం.. మేము సైతం అంటూ.. ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళం

Telangana floods: వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం.. మేము సైతం అంటూ.. ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళం
Advertisement

Telangana floods: తెలంగాణను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. భారీ వ‌ర్షాల‌కు ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగింది. చాలామంది ఇల్లు కోల్పోయారు. పరిస్థితి గమనించిన ప్రభుత్వం ఉద్యోగుల జేఏసీ.. బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ ముందు కొచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ఆస్తి, ప్రాణ న‌ష్టం భారీగా జరిగింది. ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు వేగ‌వంతం చేసింది. అన్ని విభాగాల‌ ప్ర‌భుత్వ ఉద్యోగులు అందులో నిమ‌గ్న‌మ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ విప‌త్తు భారీ న‌ష్టాన్ని మిగిల్చింది. దీన్ని గమనించారు ప్రభుత్వ ఉద్యోగులు. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత దీనిని అతిపెద్ద విప‌త్తుగా వర్ణించింది తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ.

Advertisement

ALSO READ: వరద సహాయక చర్యలపై గులాబీ నేతల మౌనమేలనో?

ఇలాంటి స‌మ‌యంలో త‌మ వంతు ప్ర‌భుత్వానికి ఆర్ధిక సాయం చేయాలని ముందుకొచ్చింది జేఏసీ. ఇందులోభాగంగా రాష్ట్రంలో ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు రూ.100 కోట్ల‌ను ప్రభుత్వానికి ఇవ్వనుంది.

Advertisement

తెలంగాణ‌లో అన్ని ప్ర‌భుత్వ విభాగాల్లోని ఉద్యోగులు దీనిపై నిర్ణ‌యం తీసుకున్నట్లు ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి వెల్లడించారు.వ‌ర‌ద బీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో ప్ర‌త్య‌క్షంగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటామని తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి వరద ప్రాంతాల్లో రెండోరోజూ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో బాధితులను పరామర్శించి వారికి దైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుటుందని భరోసా ఇచ్చారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×