E-Paper
Advertisement

స్కూల్ విద్యార్థుల కోసం సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!

స్కూల్ విద్యార్థుల కోసం సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!
Advertisement

School Uniforms: స్వేచ్చ బ్యూరో: యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌) తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా వ‌చ్చే ఏడాది పంపిణీ, వాటి రంగులు ఇత‌ర అంశాల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల‌కు యూనిఫాంల అంద‌జేత‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు.

క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం..

ప్ర‌భుత్వ పాఠ‌శాలలు, వ‌స‌తిగృహాల్లో చ‌దివే విద్యార్థులకు అంద‌జేసే యూనిఫాంల నాణ్య‌త‌లో రాజీప‌డ‌మ‌ని సీఎం తెలిపారు. ఆగ‌స్టు 15వ తేదీ నాటికి పిల్ల‌లంద‌రికీ యూనిఫాం అంద‌జేయాల్సిన‌దేన‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఈ విష‌యంలో అల‌సత్వం వ‌హిస్తే స‌హించ‌న‌ని సీఎం హెచ్చ‌రించారు. మ‌హిళా సంఘాలు కుట్టు ప‌ని వేగ‌వంతం చేసేలా క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సెర్ప్ సీఈవో దివ్య‌కు సీఎం సూచించారు.

Advertisement

Also read: Suicide Note: నా చావుకు కారణం ప్రధాని మోదీన అంటూ.. సిరిసిల్లలో విషాదం!

నాణ్య‌మైన యూనిఫాంలు..

గత ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యార్థుల‌కు యూనిఫాంల అంద‌జేత‌లో అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రించార‌ని సీఎం అన్నారు. తాము వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నామ‌ని నాణ్య‌మైన యూనిఫాంలు అందిస్తామ‌ని తెలిపారు. పేద పిల్లల కోసం పని చేస్తున్నామని అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. వచ్చే సంవ‌త్స‌రం జూన్ 2వ తేదీ నాటికే విద్యార్థుల‌కు యూనిఫాం అందేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు పి.సుద‌ర్శ‌న్ రెడ్డి, స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ స‌బ్య‌సాచి ఘోష్‌, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు, ఆయా శాఖ‌ల అధికారులు బాల మాయా దేవి, ష‌ఫీ ఉల్లా, విజ‌యేంద్ర బోయి, దివ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Also read: Minor Missing: భద్రాద్రి జిల్లాలో షాకింగ్ ఘటన.. యువకుడిపై పోక్సో కేసు నమోదు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×