E-Paper
Advertisement

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న ఇంటి వద్ద హై టెన్షన్.. మోహరించిన పోలీసులు

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న ఇంటి వద్ద హై టెన్షన్.. మోహరించిన పోలీసులు
Advertisement

Teenmar Mallanna: మేడ్చల్ జిల్లీ మేడిపల్లి పీఎస్ పరిధిలోని ఫీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. జగద్గిరిగుట్టకు చెందిన సాయి ఈశ్వర్ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలకు మల్లన్న వెళ్లే అవకాశం ఉండటంతో పోలీసులు అతడిని ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన అపార్ట్‌మెంట్ చుట్టూ భారీగా బలగాలను మోహరించారు.

బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం ప్రధానంగా హక్కుల సాధన ఉద్యమంలో పాల్గొంటున్న సాయి ఈశ్వర చారి, ప్రభుత్వాలు తమ హక్కులను కాదని నిరాశలో ఆత్మహత్య చేసుకున్నారని బీసీ జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న కార్యకర్తలు శుక్రవారం గాంధీ ఆసుపత్రి వద్ద గుమికూడి, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈశ్వర చారికి న్యాయం చేయాలని, బీసీ రిజర్వేషన్ల చట్టానికి తక్షణ ఆమోదం తెలపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Advertisement

సాయి ఈశ్వర మృతి‌పై ఆగ్రహంతో రగిలిపోయిన బీసీ సంఘాలు భారీగా చేరుకోవడంతో, పోలీసులు చర్యలు చేపట్టారు. వందలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సహా కీలక నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: ఇద్దరు భార్యలతో నామినేషన్లు.. ఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త..

Advertisement

నిరసనలో పాల్గొన్న నాయకులు సాయి ఈశ్వర కుటుంబానికి.. కనీసం రూ.1 కోటి ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరారు. వారి కుటుంబం పూర్తిగా బీసీ ఉద్యమం కోసం పోరాడిన కుటుంబమని, వారికి అన్యాయం జరగకూడదని పేర్కొన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×