E-Paper
Advertisement

Samantha : పెళ్ళైన ఐదు రోజులకే పని మొదలెట్టిన సమంత.. డెడికేషన్ కు హ్యాట్సాప్..!

Samantha : పెళ్ళైన ఐదు రోజులకే పని మొదలెట్టిన సమంత.. డెడికేషన్ కు హ్యాట్సాప్..!
Advertisement

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, రాజ్ నిడిమోరుతో ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టింది.. డిసెంబర్ 1వ తేదీల తెల్లారుజామున వీరి వివాహం జరిగింది.. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సమంత ఇప్పుడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది అని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల పెళ్లయింది కదా కొద్ది రోజులు తన భర్తతో కలిసి సంతోషంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ సమంత మాత్రం అందరి ఊహలకు అందని పని చేస్తుంది. పెళ్లయిన ఐదు రోజులకే అక్కడ ప్రత్యక్షమవడంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు సమంత ఎందుకు ఇలా చేస్తుంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.ట్రోల్స్ వచ్చే విధంగా ఆమె ఏం చేసిందనేది ఆసక్తిగా మారింది.. పెళ్ళైన ఐదు రోజులకే ఆమె చేసిన పనేంటో ఒకసారి వివరంగా తెలుస్తుంది..

పెళ్ళైన ఐదురోజే సెట్స్ లో సమంత..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనే గర్వం లేకుండా తన పనిని పూర్తి చేసే హీరోయిన్లలో సమంత ఒకరు. ఆ మధ్య ఆమె మయోసైటిస్తో బాధపడుతున్న సరే.. తాను కమిటైన సినిమాలను పూర్తి చేయాలని చాలా కష్టపడింది. అయితే ఆ సినిమాలో ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు మంచి హిట్ సినిమాను ఆందివ్వలేదు.. అయినా ఎక్కడా నిరాశ పడకుండా సినిమాలను, వెబ్ సిరీస్ లను చేస్తూ బిజీగా మారింది. ఈ టైంలోనే ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం సాగించింది. రీసెంట్ గా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 1 న పెళ్లి చేసుకుంది. 5 రోజులకు షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టింది.. ఆమె సినిమా సెట్ లో ఉన్న పిక్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోని చూసినావా మా అభిమానులు వరుసగా కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read :బంఫర్ ఆఫర్ కొట్టేసిన కళ్యాణ్ ప్రియదర్శన్..100 కోట్ల ప్రాజెక్టులో ఛాన్స్..!

‘మా ఇంటి బంగారం’ షూటింగ్ అప్డేట్..

కొత్త పెళ్లికూతురు సమంత సొంతం నిర్మాణ బ్యానర్ లో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాపై ఫోకస్ పెట్టింది. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.. ఈ థ్రిల్లర్ మూవీకి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఓ బేబీ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. బిగ్గెస్ట్ హిట్గా కూడా నిలిచింది. దాంతో ఈ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో సామ్ తో పాటుగా గుల్ష‌న్ దేవ‌య్య, దిగంత్‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. న‌టి గౌత‌మి, మంజుషా కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు.. ఇక తాజాగా సామ్ తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయినట్లు నందిని రెడ్డి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.. ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇకపోతే సామ్ సినిమాల విషయానికొస్తే.. ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం..

Advertisement

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×