E-Paper
Advertisement

Vikarabad District: నా భర్త తాగిండు.. ఐతే కొడతావా.. పోలీసులపై మహిళ ఫైర్

Vikarabad District: నా భర్త తాగిండు.. ఐతే కొడతావా.. పోలీసులపై మహిళ ఫైర్
Advertisement

Vikarabad District: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా చోటుచేసుకున్న హైడ్రామా స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని కీలకమైన విలమున్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా..  ఎక్ మామిడి గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి కారును పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో మల్లేష్ మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో నిబంధనల ప్రకారం పోలీసులు కారును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మల్లేష్‌తో పాటు కారులో ఉన్న ఆయన భార్య పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కారును తీసుకెళ్లనిచ్చేది లేదని భీష్మించుకోవడమే కాకుండా అక్కడే రోడ్డుపై హల్‌చల్ చేసింది.

Advertisement

పోలీసులు తన భర్తను కొట్టారని, తాము సామాన్యులమని చూసి వేధిస్తున్నారని ఆ మహిళ ఆరోపించింది. తాను మహిళనని కూడా చూడకుండా పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారని వాపోయింది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆమె ఆందోళనకు దిగడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ క్రమంలో పోలీసులకు, సదరు మహిళకు మధ్య గట్టి వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు ఆమెను శాంతింపజేసి, చట్టపరమైన చర్యలు చేపట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ALSO READ: Warangal: పైడిపల్లి మైసమ్మ ఆలయం కూల్చివేత.. వరంగల్‌లో హైటెన్షన్.. ప్రస్తుతం ఇది పరిస్థితి

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×