E-Paper
Advertisement

Actress Pragathi : వేణుస్వామి సంస్కారానికే వదిలేస్తున్నా.. నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్

Actress Pragathi : వేణుస్వామి సంస్కారానికే వదిలేస్తున్నా.. నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్
Advertisement

Actress Pragathi  : టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలు సాధించి దేశం గర్వించేలా చేశారు. అయితే, ఈ విజయం చుట్టూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వివాదం నెలకొంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, ప్రగతి సాధించిన ఈ మెడల్స్ వెనుక తన పూజల ప్రభావం ఉందని వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వేణుస్వామి వాదన ఏంటి?
ప్రగతి తన కెరీర్ బాగుండాలని, రెజ్లింగ్‌లో ఎదగాలని తన వద్దకు వచ్చి పూజలు చేయించుకుందని వేణుస్వామి తెలిపారు. ఆ పూజల ఫలితంగానే ఆమెకు ఈ నాలుగు మెడల్స్ వచ్చాయని ఆయన చెప్పుకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Advertisement

క్లారిటీ ఇచ్చిన ప్రగతి..
తన కష్టాన్ని వేణుస్వామి తన ఖాతాలోకి వేసుకోవడంపై ప్రగతి తాజాగా స్పందిస్తూ పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు.పూజలు చేసింది నిజమే. సుమారు రెండున్నరేళ్ల క్రితం మానసికంగా లో పాయింట్‌లో ఉన్నప్పుడు స్నేహితుల సలహాతో వేణుస్వామిని కలిశాను. మన టైమ్ బాగోలేనప్పుడు ఇలాంటివి నమ్మడం సహజం. ఆయన ఏదో పూజ చేశారు కానీ, దాని వల్ల నాకు పెద్దగా ఫలితం ఏమీ కనిపించలేదు. ఆ పూజల వల్లే నాకు మంచి జరిగిందని నేను అనుకోవడం లేదు. ఏడాది క్రితం జరిగిన పూజల ఫోటోలను ఇప్పుడు వైరల్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ప్రగతి మెడల్స్ సాధించడానికి నేనే కారణమని వేణుస్వామి చెప్పుకోవడాన్ని ఆయన సంస్కారానికే వదిలేస్తున్నానని ప్రగతి స్పష్టం చేశారు.

నెటిజన్ల మద్దతు..
ప్రగతి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. రాత్రింబవళ్లు జిమ్‌లో కష్టపడి, చెమట చిందించి సాధించిన మెడల్స్‌ను జ్యోతిష్యం ఖాతాలో వేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఒక రకంగా వేణుస్వామికి ప్రగతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×