E-Paper
Advertisement

Vivek Venkataswamy: మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన శ్రీనివాసాచారి

Vivek Venkataswamy: మంత్రి  వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన  శ్రీనివాసాచారి
Advertisement

Vivek Venkataswamy:  తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి సమక్షంలో  తూప్రాన్‌కు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త కె. శ్రీనివాసాచారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూప్రాన్ మున్సిపాలిటీలో అవినీతి అంతమే ధ్యేయంగా పనిచేస్తూ, స్వచ్ఛంద కాంగ్రెస్ పార్టీ కి శ్రీనివాస్ చారి చేసిన సేవలను గుర్తించి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీనివాసాచారి రచించిన ’21వ శతాబ్దంలో మానవవాదం’ గ్రంథాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో గత అనేక సంవత్సరాలుగా అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్న శ్రీనివాస చారి ‘తూప్రాన్ పరిరక్షణ సమితి’ వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.

Also Read:BJP Telangana: గాంధీ సరోవర్‌పై బీజేపీ పోరుబాట.. విగ్రహం కోసం వినాశనమా? 

గజ్వేల్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి దోహదం

Advertisement

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సాదరంగా కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పరిపాలనకు శ్రీనివాసాచారి అనుభవం పార్టీకి బలాన్నిస్తుందని పేర్కొన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒకటవ వార్డులో ఆయన చేసిన ప్రచారం వల్ల పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని తెలిపారు. 2009 నుండి తూంకుంట నర్సారెడ్డి తో సన్నిహితంగా పనిచేస్తున్న శ్రీనివాసాచారి చేరిక, తూప్రాన్ మరియు గజ్వేల్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి దోహదం పడుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జ్యోతి కృష్ణ ముదిరాజ్, నాగరాజు గౌడ్, జింక మల్లేష్ తదితర జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read: Upcoming Air Coolers March 2026: ఆఫీసులో కూర్చొనే ఇంట్లో కూలర్‌ను ఆపరేట్ చేయొచ్చు.. ధర కూడా తక్కువే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×