E-Paper
Advertisement

షాబాద్‌లో ఆరుగురు హత్యలు.. వెలుగులోకి కొత్త విషయాలు, పదునైన కత్తితో- రెండు గంటల్లో

షాబాద్‌లో ఆరుగురు హత్యలు.. వెలుగులోకి కొత్త విషయాలు, పదునైన కత్తితో- రెండు గంటల్లో
Advertisement

Shabad Mass Murder Case: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఆరుగురు హత్య కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కేవలం రెండు గంటల్లో ఆరు హత్యలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. హత్య చేయడానికి నిందితుడు రాజ్ కుమార్ కారుని ఉపయోగించాడు. ఆ కారు ఎవరిది? అనేదానిపై కూపీ లాగుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు హత్య కేసులో కొత్త విషయాలు-రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాల గూడలో దారుణమైన ఘటన జరిగింది. ఈ కేసులో కొత్త విషయాలు బయటపెట్టారు పోలీసులు. తల్లిదండ్రులకు ఫోన్ చేసిన చెప్పిన నిందితుడు రాజ్‌కుమార్, వరుస హత్యలు చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. అతడి కోసం పోలీసులు ఏడు బృందాలు రంగంలోకి దిగాయి.

Advertisement

కేవలం రెండు గంటల్లో ఆరు హత్యలు-రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. నిందితుడు రాజ్ కుమార్ ఏడేళ్ల కిందట సరితను అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐదేళ్లలోపు ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండు నెలల కిందట ఓ బాలిక కేసులో రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదు అయ్యింది. కొన్నాళ్లు జైలులో ఉన్నాడు.

ఆ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని విడుదలయ్యాడు. తన పరువు తీసినవాళ్లు ఈ భూమ్మీద ఉండకూడదని డిసైడ్ అయ్యాడు. అందుకు జైలులో ప్లాన్ చేసుకున్నాడు. దాని ప్రకారం శుక్రవారం రాత్రి 11  గంటల నుంచి ఒంటి గంట మధ్య రెండు ప్రాంతాల్లో ఆరు హత్యలు చేశాడు. తొలుత రాత్రి 11 గంటలకు బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లి, అమ్మమ్మలను హతమార్చాడు.

Advertisement

బాలికను అర్ధరాత్రి చెరువు వద్దకు తీసుకెళ్లి-అనంతరం బాలికను  దైవాలగూడ ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో చెరువు వద్ద తీసుకెళ్లి అత్యంత దారుణంగా చంపేశాడు. అక్కడి నుంచి కారులో రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చాడు రాజ్‌కుమార్. భార్య సరితను నిద్రలేపి ఆమె, ఐదేళ్లలోపు ఉన్న ఇద్దరు కొడుకులను అత్యంత దారుణంగా కడతేర్చాడు. సరిగ్గా ఒంటి గంట సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పరారయ్యాడు.

వరుస హత్యల తర్వాత నిందితుడు పరారయ్యాడని సీపీ తరుణ్ జోషి తెలిపారు. నిందితుడు భార్య పిల్లల్ని చంపడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నిందితుడు డ్రైవింగ్ చేసిన కారు గురించి ఆరా తీశారు పోలీసులు. ఆరుగుర్ని కత్తితో పొడిచి పొడిచి చంపి కసి తీర్చుకున్నాడు నిందితుడు.

నిందితుడు  రాజ్‌కుమార్‌ను తమకు అప్పగించాలంటూ షాబాద్ పోలీసు స్టేషన్ ఎదుట మృతులకు చెందిన కుటుంబసభ్యులు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ఆందోళనలు కొనసాగుతున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోకపోగా, తమను వెళ్లిపోవాలని అంటున్నారు చెబుతున్నారు బాధితులు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×