E-Paper
Advertisement

Shejal: ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా.. శేజల్ వదిలేదేలే..

Shejal: ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా.. శేజల్ వదిలేదేలే..
Advertisement
shejal mla

Shejal: ఆరిజన్‌ డెయిరీ నిర్వహకురాలు శేజల్‌ మరోసారి ఆందోళనకు దిగారు. బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని నిలదీశారు. పోలీసులు కలుగజేసుకుని ఆమెను స్టేషన్‌కు తరలించారు.

తాను ఎవరికీ ఇబ్బంది కలుగకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. ఎలా అడ్డుకుంటారని శేజల్‌ నిలదీసింది. అన్యాయం జరిగినప్పుడు రాని పోలీసులు.. ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తే మాత్రం త్వరగా వస్తారని విమర్శించింది. అంతేకాకుండా తనపై 2012 నుంచే కేసులు ఉన్నాయంటూ అడ్డగోలుగా వాగుతున్నారని వాపోయింది. 2012నాటికి తాను 6 వ తరగతి చదువుతున్నానని తెలిపింది. కావాలనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలతో దాదాపు 7 నెలలుగా శేజల్‌ ఆందోళన చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోనూ ఆమె గళం వినిపించారు. ఇటీవల జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి గుడి దగ్గర షేజల్‌ స్పృహకోల్పోయి పడిపోయింది. అయినా ఇంతవరకూ ప్రభుత్వం నుంచి గానీ ఎమ్మెల్యే నుంచి ఎలాంటి సమాధానం రావడంలేదని పలువురు విమర్శిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×