E-Paper
Advertisement

Sejal vs Durgam Chinnaiah: రోడ్డెక్కిన శేజల్.. విపక్షాల సపోర్ట్.. ఎమ్మెల్యే దుర్గంను ఓడిస్తానంటూ శపథం..

Sejal vs Durgam Chinnaiah: రోడ్డెక్కిన శేజల్.. విపక్షాల సపోర్ట్.. ఎమ్మెల్యే దుర్గంను ఓడిస్తానంటూ శపథం..
Advertisement
Sejal on Durgam Chinnaiah latest news

Sejal on Durgam Chinnaiah latest news(Telangana news updates):

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా శేజల్‌ చేపట్టిన ప్రచారానికి విపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు అండగా నిలిచాయి. అయితే.. శేజల్‌ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్‌ శ్రేణులు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు శేజల్‌ను అరెస్ట్‌ చేసి ఆస్పత్రికి తరలించారు. దీంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

ఇక బీజేపీ నేత కోడి రమేష్‌ ఇంటి ముందు బైఠాయించి బీఆర్ఎస్‌ శ్రేణులు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే దుర్గంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రా అమ్మాయికి సపోర్ట్‌ చేస్తూ.. శిఖండి రాజకీయాలు చేస్తున్నారంటూ విపక్షాలపై ఫైర్‌ అయ్యారు.

Advertisement

ఆదిలాబాద్‌ జిల్లాలో చిన్నయ్మ ఓటమికి కౌంట్‌డౌన్‌ మొదలైందంటూ ఫైర్‌ అయింది ఎమ్మెల్యే చిన్నయ్య బాధితురాలు శేజల్‌. తాను ఏ తప్ప చేయలేదు కాబట్టే సీఎం కేసీఆర్‌ టికెట్‌ ఇచ్చారని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

చిన్నయ్యకు వ్యతిరేకంగా బెల్లంపల్లిలో గడపగడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన శేజల్‌.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనను లైంగిక వేధించడమే కాకుండా నమ్మకం ద్రోహం చేసి, అక్రమ కేసులు పెట్టించి రిమాండ్‌కు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కామ పిశాచి, భూబకాసురుడు, అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ చిన్నయ్యకు ఓటే వేయొద్దంటూ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు శేజల్‌.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×